వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ కి అంత సీన్ లేదు, రాదు: రష్యా

|
Google Oneindia TeluguNews

మాస్కో: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు హెలికాప్టర్లు కూల్చివేసే సత్తా లేదని రష్యా పేర్కొంది. తమ దేశానికి చెందిన హెలికాప్టర్లు , ట్రక్కులు ధ్వంసం చెయ్యలేదని రష్యా స్పష్టం చేసింది. సిరియాలోని ఓ బేస్ పాయింట్లో సుమారు 15 హెలికాప్టర్లు, యుద్ధంలో ఉపయోగించే ట్రక్కులు ఉన్నాయి.

ఆ హెలికాప్టర్లు, ట్రక్కులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ధ్వంసం చేశారని కొన్ని షాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో రష్యా వివరణ ఇచ్చింది. హెలికాప్టర్లు ధ్వంసం చెయ్యలేదని స్పష్టం చేసింది. మా దేశానికి చెందిన యుద్ధ హెలికాప్టర్లు, ట్రక్కులు భద్రంగా ఉన్నాయని చెప్పింది.

Russian militart denies ISIS destroyed its Helicopters in Syria

సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్ లో ప్రతి రోజులాగే తాము ఇప్పటికీ ఉగ్రవాదుల స్థావరాల మీద దాడులు చేస్తున్నామని, అదే పనిలో ఉన్నామని రష్యా మిలటరీ అధికారులు అంటున్నారు. మా దేశానికి చెందిన సైనికులకు ఏమి కాలేదని, కనీసం ఒక్క సైనికుడికి గాయాలు కాలేదని రష్యా డిఫెన్స్ అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ తెలిపారు. అయితే ఈ విషయంపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.

English summary
ISIS announced that four Russian attack helicopters and 20 supplies trucks were destroyed by fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X