• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పుతిన్ సంచలనం: అన్‌ఫ్రెండ్: 50కి పైగా దేశాలతో రష్యా కటీఫ్: జాబితా ఇదే: భారత్..!

|
Google Oneindia TeluguNews

మాస్కో: తన పొరుగు దేశం ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తోన్న యుద్ధం 13వ రోజుకు చేరుకున్నవేళ.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- కీలకమైన నోట్‌పై సంతకం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడాన్ని వ్యతిరేకిస్తోన్న దేశాల పేర్లతో కూడిన నోట్ అది. ఆయా దేశాలన్నింటితో స్నేహ సంబంధాలను తెంచుకుంటున్నట్లు పుతిన్ ప్రకటించారు. వాటిని అన్‌ఫ్రెండ్లీ దేశాలుగా గుర్తించారు.

మోడీ మాట్లాడినా..

మోడీ మాట్లాడినా..


ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం 13వ రోజుకు చేరుకుంది. అంతర్జాతీయంగా తనపై వస్తోన్న ఒత్తిళ్లను ఏ మాత్రం లెక్క చేయట్లేదు పుతిన్. తన దూకుడును పెంచుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం- ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 50 నిమిషాల పాటు వారి మధ్య సంభాషణ కొనసాగింది. అంతకుముందే మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీనీ సంప్రదించారు. 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ ఇద్దరికీ కొన్ని విలువైన సూచనలు చేశారు.

 కమిషన్ అనుమతి..

కమిషన్ అనుమతి..

అవేవీ పరిగణనలోకి తీసుకోనట్టే కనిపించారు పుతిన్. తాజాగా అన్‌ఫ్రెండ్లీ దేశాలతో కూడిన జాబితాను ఆమోదించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా దేశాలన్నింటితో భవిష్యత్‌లో స్నేహపూరకంగా వ్యవహరించలేమని పుతిన్ స్పష్టం చేసినట్టయింది. ఫలితంగా- ఆయా దేశాలు రష్యాతో కార్పొరేట్ వ్యవహారాలు గానీ, ఇతర లావాదేవీలను గానీ నిర్వహించుకోవాలంటే.. పుతిన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిషన్ అనుమతిని ఇకపై తీసుకోవాల్సి ఉంటుంది.

 ఆ దేశాలివే..

ఆ దేశాలివే..

పుతిన్ తాజాగా ఆమోదించిన అన్‌ఫ్రెండ్లీ దేశాల జాబితాలో- అమెరికా, ఆస్ట్రేలియా, అల్బేనియా, ఆండొర్రా, బ్రిటన్, బ్రిటన్‌కు చెందిన జెర్సీ అంగ్విల్లా, బ్రిటీష్ వర్జిన్ ఐలండ్స్, జీబ్రాల్టర్, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, ఐస్‌ల్యాండ్, కెనడా, లీఛెన్‌స్టెయిన్, మైక్రోనేసియా, మొనాకో న్యూజిలాండ్, నార్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాన్ మెరినో, నార్త్ మాసిడోనియా, సింగపూర్, తైవాన్, ఉక్రెయిన్, మాంటెనెగ్రో, స్విట్జర్లాండ్, జపాన్ ఉన్నాయి.

ఆంక్షలను విధించడం వల్లేనా..

ఆంక్షలను విధించడం వల్లేనా..


ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆరంభించిన తరువాత పలు దేశాలు రష్యాను వాణిజ్యపరంగా దూరం పెట్టాయి. ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞలను జారీ చేశాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలన్నీ రష్యాను ఓ రకంగా వాణిజ్య యుద్ధాన్ని సాగిస్తోన్నాయి. చివరికి- విసా, మాస్టర్‌కార్డ్‌ల లావాదేవీలు కూడా రష్యాలో స్తంభించే పరిస్థితి ఏర్పడింది. వైమానిక సంబంధాలపైనా నిషేధాన్ని విధించాయి. రష్యాకు చెందిన విమానాల రాకపోకల కోసం తమ గగనతలాన్ని మూసివేశాయి.

దీనికి ప్రతిచర్యగా..

దీనికి ప్రతిచర్యగా..

దీనికి ప్రతిచర్యగా- వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఆయా దేశాలతో స్నేహ సంబంధాలను తెంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అన్‌ఫ్రెండ్లీ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తమ దేశంలో ఆర్థికపరమైన కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ప్రత్యేకంగా అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పుతిన్ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయా కంపెనీల దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తరువాతే అనుమతులను మంజూరు చేస్తుందా కమిషన్.

Russia Ukraine Conflict : Russian Space Rocket Removed US, UK & Japan Flags | Oneindia Telugu
మూడో విడత చర్చల్లో..

మూడో విడత చర్చల్లో..

యుద్ధాన్ని నిలిపివేయడానికి రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్‌లో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. రష్యా ప్రతిపాదించిన డిమాండ్లకు ఉక్రెయిన్ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. యుద్ధం ఆరంభమైన తరువాత ఈ రెండు దేశాల ప్రతినిధులు ముఖాముఖి సమావేశం కావడం ఇది మూడోసారి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరబోనంటూ ఉక్రెయిన్ లిఖితపూరకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుందనేది రష్యా ప్రధాన డిమాండ్.

English summary
Russia has included Australia in a list of 50 countries that have taken 'unfriendly actions' against it following Vladimir Putin's invasion of Ukraine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X