వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను గుర్తించం, కానీ..: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

|
Google Oneindia TeluguNews

మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రాష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి నాయకత్వంలోనైనా అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుపును మాత్రం గుర్తించేందుకు సిద్ధంగా లేనని పుతిన్ తేల్చి చెప్పారు.

అప్పటి వరకు జో బైడెన్‌ను గుర్తించం: పుతిన్

అప్పటి వరకు జో బైడెన్‌ను గుర్తించం: పుతిన్

అమెరికా ప్రజల నమ్మకాన్ని కలిగిన ఏ నాయకుడితోనైనా తాము కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు. కానీ, ఆ విశ్వాసాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించిన అభ్యర్థి లేదా చట్టపరమైన మార్గంలో ఫలితాలు నిర్ధారించబడిన తర్వాతే పొందుతారు అని రష్యాన్ అధికారిక మీడియాలో వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.

అమెరికా-రష్యా సంబంధాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..

అమెరికా-రష్యా సంబంధాలు ఎప్పుడో దెబ్బతిన్నాయి..

జో బైడెన్‌ను అభినందించకూడదని క్రెమ్లిన్ నిర్ణయం తీసుకుందని, వీటిలో ఎలాంటి ఉద్దేశాలు లేవని పుతిన్ పేర్కొన్నారు. ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను దెబ్బతీస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. దెబ్బతినడానికి ఏమీ లేవన్నారు. అవి ఇప్పటికే పూర్తిగా క్షీణించిపోయాయని పుతిన్ వెల్లడించారు.

అభినందనలు తెలపని రష్యా.. చైనా చివరకు..

అభినందనలు తెలపని రష్యా.. చైనా చివరకు..

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత జో బైడెన్‌కు పలు ప్రపంచ దేశాధినేతలు అభినందనలు తెలిపారు. రష్యా, చైనాలు మాత్రం అభినందనలు తెలియజేయలేదు. మొదట బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా గుర్తించమని చెప్పిన చైనా.. చివరకు శుభాకాంక్షలు తెలిపింది. రష్యా మాత్రం ఇప్పటికీ బైడెన్‌ను గుర్తించమని ప్రకటించడం గమనార్హం.

Recommended Video

COVID-19 : Russia Intrested To Manufacture Covid Vaccine Sputnik V In India | Oneindia Telugu
అధికారం కోసం జో బైడెన్ వర్సెస్ ట్రంప్..

అధికారం కోసం జో బైడెన్ వర్సెస్ ట్రంప్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. రిగ్గింగ్ చేసి గెలిచారంటూ జో బైడెన్‌పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు జో బైడెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక అధికారిక భవనం వైట్ హౌస్ కూడా అధికార మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

English summary
Russian President Vladimir Putin said he’s ready to work with any US leader, but still isn’t ready to recognize the election victory of Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X