వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : రష్యా ప్రధానికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్..

|
Google Oneindia TeluguNews

రష్యా ప్రధాని మైఖైల్‌ మిషుస్తిన్‌‌(54)కు కరోనా వైరస్ సోకింది. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్టు అధ్యక్షుడు పుతిన్‌కు మైఖెల్ కబురు పంపించారు. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ప్రధానమంత్రి విధులను డిప్యూటీ ప్రధాని అంద్రెయ్ బెలోసోవ్ నిర్వహించనున్నారు. అయితే కీలక అంశాలకు సంబంధించిన సంప్రదింపులకు తాను టచ్‌లోనే ఉంటానని మైఖెల్ స్పష్టం చేశారు.

Recommended Video

COVID-19 : Russian Prime Minister Mikhail Mishustin Tests Positive For Coronavirus

మైఖైల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ.. వైరస్ మహమ్మారితో సతమతమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే విధి విధానాల రూపకల్పనలో మిషుస్తిన్ పాల్గొంటారని ఒక వీడియో కాల్ సందర్భంగా పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యాలో ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యత ప్రధాని పైనే ఉంటుంది.

Russian Prime Minister Mikhail Mishustin tests positive for Covid 19

కరోనా కష్ట కాలంలో రష్యా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలనుకుంటున్న తరుణంలోనే ఆయనకు వైరస్ సోకవడం గమనార్హం. బుధవారం(ఏప్రిల్ 29) ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా సరిహద్దులు ఎప్పుడు తెరుస్తామన్న దానిపై కచ్చితమైన తేదీని ఇప్పుడే వెల్లడించలేమని స్పష్టం చేశారు.

ప్రధానికి వైరస్ సోకడంతో అధికార యంత్రాంగంలోనూ ఒకింత ఆందోళన నెలకొంది. చివరిసారిగా అధ్యక్షుడు పుతిన్ ప్రధానితో ఎప్పుడు కలిశారన్నది ఇప్పటివరకూ తెలియరాలేదు. రష్యాలో ఇప్పటివరకూ 106,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11,619 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,073 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రష్యాలో 93,806 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇందులో 2,300 మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక రిపోర్టులు చెబుతున్నాయి.

English summary
Russian Prime Minister Mikhail Mishustin says he has tested positive for the new coronavirus and has told President Vladimir Putin he will self-isolate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X