వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో వ్యాక్సిన్‌తో రష్యా రెడీ... ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ సక్సెస్... నవంబర్‌లో ఉత్పత్తి...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ చికిత్స కోసం ప్రపంచ దేశాలన్నింటి కంటే ముందు రష్యా 'స్పుత్నిక్ వి' టీకాను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని మొదటి దశ ఉత్పత్తిని కూడా రష్యా ప్రారంభించింది. తాజాగా ఇదే రష్యా నుంచి మరికొద్దిరోజుల్లోనే మరో కరోనా వ్యాక్సిన్ కూడా రానుంది. వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరలాజీ&బయాలజీ అభివృద్ది చేసిన ఈ వ్యాక్సిన్... ప్రీ-క్లినికల్ ట్రయల్స్‌లో దాని సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఆ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మక్స్యుతోవ్ ఈ విషయాన్ని సోమవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ సక్సెస్...

ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్ సక్సెస్...

'వెక్టార్ సెంటర్ అభివృద్ది చేసిన పెప్టైడ్-బేస్డ్ వ్యాక్సిన్ ప్రీక్లినికల్ ట్రయల్స్‌లో అధిక సామర్థ్యాన్ని కనబరిచింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది.' అని మక్స్యుతోవ్ తెలిపారు. వ్యాక్సిన్‌ మొదటి దశ ట్రయల్స్‌కు సంబంధించి ఇప్పటికే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రీసెర్స్ సెంటర్ రిపోర్టులు కూడా సమర్పించినట్లు తెలిపారు. మొదటి దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతీ ఒక్కరూ బాగున్నట్లు చెప్పారు.

నవంబర్ నుంచి ఉత్పత్తి...

నవంబర్ నుంచి ఉత్పత్తి...

ట్రయల్స్‌కి ముందుకొచ్చిన మొట్టమొదటి వలంటీర్‌ రెండోసారి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారని... 21 రోజుల పర్యవేక్షణ తర్వాత అతను ఆస్పత్రి నుంచి వెళ్లాడని చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిని ఇంకా పర్యవేక్షిస్తున్నామని... మరో మూడుసార్లు అతని ఆస్పత్రికి రావాల్సి ఉందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ సెప్టెంబర్‌లో పూర్తవుతాయని రష్యా శానిటరీ వాచ్‌డాగ్ వెల్లడించింది. అక్టోబర్ 2020లో వ్యాక్సిన్‌ను అధికారికంగా నమోదు చేస్తామని,నవంబర్ నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది.

ఇప్పటికే స్పుత్నిక్ వి...

ఇప్పటికే స్పుత్నిక్ వి...

కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటికే రష్యా 'స్పుత్నిక్ వి' వ్యాక్సిన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌గా దీనికి గుర్తింపు లభించింది. నిజానికి అగస్టులో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉండగా... రష్యా మాత్రం ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో దీని సామర్థ్యంపై పలు దేశాల్లో సందేహాలు,అనుమానాలు నెలకొన్నాయి. అయితే రష్యా మాత్రం తమ వ్యాక్సిన్ పనితీరుపై చాలా నమ్మకంగా ఉంది. ఒకవేళ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్‌ను భాగస్వామిగా ఉండాలని రష్యా కోరే పక్షంలో... దాని పనితీరును ఐసీఎంఆర్ సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆశాజనకంగా పలు టీకాలు....

ఆశాజనకంగా పలు టీకాలు....

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంకా అభివృద్ది దశలో ఉన్న కరోనా వ్యాక్సిన్లను పరిశీలిస్తే... చైనా కేన్సినో(Cansino),అమెరికా మోడెర్నా,ఫైజర్(Moderna and pfizer vaccines),ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేన్సినో వ్యాక్సిన్‌ వాడకానికి చైనా ఇప్పటికే అనుమతినిచ్చింది. అయితే దీని మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం సౌదీలో జరుగుతున్నాయి. మోడెర్నా,ఫైజర్‌ల మూడో దశ ప్రయోగాలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే ఆస్ట్రాజెనెకా మూడో దశ ప్రయోగాలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అమెరికా,బ్రెజిల్ దేశాల్లో ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు మంచి ఫలితాలినిచ్చాయి.

English summary
The anti-coronavirus vaccine developed by the Vektor State Research Center of Virology and Biotechnology of the Russian sanitary regulator has proved its high efficiency during preclinical trials, Rinat Maksyutov, the center’s director, said in an interview with the Rossiiskaya Gazeta that came out on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X