వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్షుడిగా మళ్లీ పుతిన్? ఎన్నిక లాంఛనమేనా? స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం పదవిలో...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యా అధ్యక్షుడిగా మళ్లీ వ్లాదిమిర్ పుతిన్(65) ఎన్నిక కానున్నారు. ఆదివారం రష్యాలో ప్రారంభమైన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం లాంఛనమేనని తెలుస్తోంది. ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీ ఖాయమని అనేక సర్వేలు ఇప్పటికే తేల్చాయి.

1999 నుంచి దేశాధ్యక్ష పదవిలో ఉన్న పుతిన్‌.. మళ్లీ గెలిస్తే 2024 వరకు ఎదురుండదు. కానీ, ఇటీవల జరిగిన రెండు పరిణామాలు ఆయన విజయాన్ని మసకబార్చడం ఖాయమని అంటున్నారు. ఒకటి- బ్రిటిష్-రష్యా గూఢచారిపై విష రసాయన దాడి కాగా, రెండోది- 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తలదూర్చినందుకు ఆంక్షలు విధించడం.

స్టాలిన్ తరువాత అత్యధిక కాలం పదవిలో...

స్టాలిన్ తరువాత అత్యధిక కాలం పదవిలో...

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ మధ్యే జీవితకాల అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆ దేశ కమ్యూనిస్ట్‌ పార్టీ చేత ఆమోదముద్ర వేయించుకున్నారు. అదే తరహాలో పుతిన్‌ కూడా వీలైనంత ఎక్కువ కాలంపాటు అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు. జోసెఫ్‌ స్టాలిన్‌ (30 ఏళ్లు) తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగనున్న అధినేత పుతినే (19 ఏళ్లు). స్టాలిన్‌ నియంత అయితే పుతిన్‌ బయటకు కనబడని నియంత అని రష్యన్‌ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు.

గెలుపు నల్లేరుపై నడకే...

గెలుపు నల్లేరుపై నడకే...

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గెలుపు నల్లేరుపై నడకేనన్న వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. ప్రీ పోల్‌ సర్వేలో కూడా పుతిన్‌కు 69.7 శాతం మద్దతు తెలపవచ్చని వస్తే.. ఆయన సమీప ప్రత్యర్థి పావెల్‌ గ్రడినిన్‌కు 7.1 శాతం మంది మాత్రమే ఓటేశారు. అయితే ఓటర్లలో ఆసక్తి పలచబడిందని, పోలింగ్‌ తగ్గవచ్చని పశ్చిమ మీడియా వ్యాఖ్యానించింది.

మసకబారిన పుతిన్ ప్రతిష్ట...

మసకబారిన పుతిన్ ప్రతిష్ట...

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గెలుపు ఖాయమైనా ఇటీవలి రెండు పరిణామాలతో ఆయన ప్రతిష్ట మసకబారిందని విమర్శకులు చెబుతున్నారు. అమెరికా 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా తలదూర్చిందని, ట్రంప్‌కు అనుకూలంగా పుతిన్ వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తరువాత ఐదు రష్యన్‌ సంస్థలు, 19 మంది రష్యన్‌ అధికారులపై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. తాజాగా బ్రిటన్‌లో తన మాజీ గూఢచారిపై రష్యా నెర్వ్ ఏజెంట్ ద్వారా విషప్రయోగానికి పాల్పడిందనే ఆరోపణలు కూడా పుతిన్ ప్రతిష్టను మసకబార్చాయి.

గూఢచారిపై నెర్వ్ ఏజెంట్ దాడి....

గూఢచారిపై నెర్వ్ ఏజెంట్ దాడి....

బ్రిటన్‌ దక్షిణ ప్రాంతంలోని శాలిస్బరీలో ఉంటున్న రష్యన్‌ జాతీయుడు.. సెర్గీ స్ర్కిపాల్‌. రష్యా సైనిక రహస్యాలను, రక్షణ వివరాలను ఏళ్ల తరబడి బ్రిటన్‌కు రహస్యంగా చేరవేసినట్లు ఆయనపై అభియోగం. నేరం అంగీకరించడంతో 13 ఏళ్ల జైలుశిక్ష విధించారు. తర్వాత విడుదలై శాలిస్బరీ వెళ్లిపోయి శేష జీవితం గడుపుతున్నాడు. ఈనెల 4న కుమార్తెతో కలిసి ఓ ఇటాలియన్‌ రెస్టారెంట్‌లో భోజనం చేశాడు. అనంతరం రెస్టారెంట్‌ బయట బెంచ్‌పై తండ్రీకూతుళ్లు ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి కనిపించారు. వారిపై ప్రాణాంతక విష పదార్థాలతో కూడిన నెర్వ్‌ ఏజెంట్‌ దాడి జరిగిందని వైద్యుల పరీక్షల్లో తేలింది.

ఏమిటీ నెర్వ్ ఏజెంట్స్?

ఏమిటీ నెర్వ్ ఏజెంట్స్?

1970-80 దశకాల్లో అప్పటి సోవియట్‌ యూనియన్‌ వినియోగించిన విష రసాయనాలు, విష వాయువులను విరజిమ్మే అణువులే ఈ నెర్వ్‌ ఏజెంట్స్‌. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి గుళికలు, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయి. వీటిని వ్యక్తులపై ప్రయోగించినప్పుడు వారి శరీరంలోని నాడీకణ వ్యవస్థను కుప్పకూల్చేస్తాయి. దీంతో ఆ వ్యక్తులు ఉన్నపళంగా కూలిపోతారు. వారి శరీరంలోని వ్యవస్థలు క్రమేణా నిర్వీర్యమై మరణిస్తారు.

హెచ్చరికలకు భయడని రష్యా...

హెచ్చరికలకు భయడని రష్యా...

మాజీ గూఢచారి సెర్గీ స్ర్కిపాల్‌పై నెర్వ్ ఏజెంట్‌తో రష్యాయే దాడి జరిపినట్లు మార్చి 6న బ్రిటిష్ ప్రధాని థెరెసా మే ఆరోపించారు. దీనిపై రష్యా వివరణ ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఆ తరువాత 23 మంది రష్యన్‌ దౌత్యవేత్తలను బ్రిటన్‌ బహిష్కరించింది. బ్రిటన్‌ నిర్ణయాన్ని అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ సమర్థించాయి. అవసరమైతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. సదరు ప్రకటనపై నాలుగు అగ్రరాజ్యాల అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్‌, థెరెసా మే, ఏంజెలా మెర్కెల్‌, ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ సంతకాలు కూడా చేశారు. అయినా రష్యా ఏమాత్రం బెదరలేదు. ఆధారాలుంటే చూపాలని డిమాండ్‌ చేయడమేకాక బ్రిటిష్ చర్యకు ప్రతిగా 23 మంది బ్రిటిష్‌ దౌత్యవేత్తలను బహిష్కరించింది.

English summary
Russians were voting Sunday in a presidential election widely expected to cement President Vladimir Putin's power for another six years. Polls first opened in the country's far east, and 107.3 million voters are eligible to cast ballots across the 11 time zones of the world's biggest country. Putin cast his vote in Moscow on Sunday morning. "I am sure of the correctness of the course that I propose for the country," he said, according to state news agency RIA-Novosti. Around 97,000 polling stations have been opened, according to the Central Election Commission. Russians have a choice of eight candidates, including the communist Pavel Grudinin, a fruit-farm millionaire and Ksenia Sobchak, the daughter of Putin's political mentor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X