వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్-400 ఎఫెక్ట్: భారత్‌కు త్వరలోనే తెలుస్తుందంటూ ట్రంప్ పరోక్ష హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కాట్సా చట్టాన్ని పట్టించుకోకుండా రష్యా నుంచి ఎస్-400 క్షిపణుల కొనుగోళ్లకు భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. 'భారత్ త్వరలోనే తెలుసుకుంటుంది' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

<strong>రష్యా నుంచి ఎస్- 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం</strong>రష్యా నుంచి ఎస్- 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు మోడీ పుతిన్ మధ్య కుదిరిన ఒప్పందం

భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది.. ఊహించినకంటే ముందే..

భారత్‌కు త్వరలోనే తెలుస్తుంది.. ఊహించినకంటే ముందే..

బుధవారం వాషింగ్టన్‌లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ట్రంప్ ఈ మేరకు స్పందించారు. భారత్ ఎస్-400 క్షిపణుల కొనుగోళ్ల ఒప్పందంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆంక్షల పరిధిలోకి వస్తారో లేదో భారత్ త్వరలోనే తెలుసుకుంటుందని, ఊహించిన దానికన్నా ముందే దీనిపై మీకు సమాధానం లభిస్తుందని పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు మాత్రమే..

అమెరికా అధ్యక్షుడు మాత్రమే..

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ట్రంప్ ఆయనతో భేటీ అయ్యారు. కాగా, భారత్‌కు కాట్సా చట్టం కింద మినహాయింపును ఇచ్చే అధికారం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంది.

మిత్రదేశాలకు వర్తిస్తుంది..

మిత్రదేశాలకు వర్తిస్తుంది..

ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడిన అమెరికా మిత్రదేశాలకు ఇది వర్తిస్తుందని శ్వేతసౌధానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి అన్నారు. ఇది కూడా చాలా పరిమితంగానేనని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

మిత్రదేశాలను దెబ్బతీసేందుకు కాదు..

మిత్రదేశాలను దెబ్బతీసేందుకు కాదు..

ఇది ఇలావుంటే, భారత్‌లో అమెరికా రాయబార ప్రతినిధి మాట్లాడుతూ.. కాట్సా చట్టం రష్యాను కట్టడి చేయడానికి మాత్రమేనని, అమెరికా మిత్రదేశాల సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడానికి కాదని స్పష్టం చేశారు. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత‌కు వచ్చిన సందర్భంగా ఎస్-400 క్షిపణుల కొనుగోళ్లపై భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

English summary
US President Donald Trump said that India "will soon find out" about his decision on the punitive CAATSA sanctions after India signed a USD 5 billion deal to purchase the much-vaunted S-400 air defence system from Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X