• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మారని పాక్: సార్క్ మీట్‌లో ఆప్ఘన్ పాల్గొనాలట..? వ్యతిరేకించిన సభ్య దేశాలు, క్యాన్సిల్

|

దాయాది పాకిస్తాన్ వైఖరి మారడం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా తన బుద్ది పోనియడం లేదు. ఇప్పుడు ఆప్గనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వానికి వంతపాడింది. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆ దేశం కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరంది. కరోనా వల్ల గతేడాది వర్చువల్ విధానంలో మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

76వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో న్యూయార్క్‌లో ఈ నెల 25వ తేదీన జరగనుంది. అయితే సమావేశం నిర్వహించేందుకు అన్ని దేశాలు అనుకూలంగా లేవు. దీంతో మీటింగ్ రద్దు చేశామని.. నేపాల్ విదేశాంగ మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. దీనికి కారణం పాకిస్తాన్ వైఖరి అని తెలుస్తోంది. సమావేశంలో ఆప్ఘన్ ప్రతినిధికి ఛాన్స్ ఇవ్వాలని మెలిక పెట్టింది. ఇదీ అందరికీ నచ్చలేదు. అయితే అంతకుముందు ఆస్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై మాత్రం పాకిస్తాన్ విముఖత వ్యక్తం చేసింది. కానీ తాలిబాన్లపై అమితమైన ప్రేమను చూపిస్తోంది.

సమావేశం నిర్వహించడానికి చాలా దేశాలు ఇష్టపడలేదు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సమావేశం నిర్వహణ వాయిదాపడింది. ఆగస్ట్‌ 15వ తేదీన తాలిబాన్లు అధికారం చేపట్టారు. ఆ నెల 31వ తేదీన అమెరికా దళాలు వెనక్కి వచ్చాయి. వెంటనే అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. తాలిబాన్ల విదేశాంగ మంత్రిగా అమిర్ ఖాన్ ముత్తాఖీ వ్యవహరిస్తున్నారు. సార్క్‌‌లో భారత్ సహా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులు, శ్రీలంక, పాకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. 1987 జనవరి 17వ తేదీన సార్క్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

SAARC foreign ministers’ meet cancelled due to

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
Pakistan is insisting that the Taliban regime in Afghanistan be allowed to send a representative to the upcoming SAARC foreign ministers' meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X