• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయ్యో పాపం: బిడ్డకు పాలివ్వలేని పరిస్థితి తల్లిది: ఆహారం కోసం ఎదురు చూపు.. గాజా ప్రజల దీనగాథ..!

|

గాజా: ఇజ్రాయిల్ - పాలస్తీనా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అది ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాలుగా అక్కడి పరిస్థితి అలానే ఉంటోంది. ఇక ఈ రెండు దేశాల ఆధిపత్య పోరులో అమాయకులైన ప్రజలు కొన్ని వేల మంది మరణించారు. మరికొందరు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురయ్యారు. తాజాగా ఇజ్రాయిల్ పాలస్తీన మధ్య జరుగుతున్న యుద్ధంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. నిమిషానికి మూడు రాకెట్లతో ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ఇక ఈ రెండు దేశాల భీకరపోరులో గాజా నగరం ఎక్కువగా దెబ్బతినింది. అంతేకాదు అక్కడి ప్రజలకు కొన్ని రోజులుగా ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

 గాజా ప్రజల పరిస్థితి దారుణం

గాజా ప్రజల పరిస్థితి దారుణం

గాజా నగరం... ఇజ్రాయిల్ - పాలస్తీన దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అత్యంత త్రీవ స్థాయిలో గాయపడిన నగరం. ఎటు చూసినా మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. రాకెట్ల దాడిలో అమాయక ప్రజలు నేలకొరిగారు. ఇక అక్కడి ప్రజల కష్టాలు వర్ణించలేనివిగా ఉన్నవి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో గాజా నగర ప్రజలకు తినేందుకు తిండి తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు. కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి. కొందరు రాకెట్ల దాడిలో ప్రాణాలు కోల్పోగా మరికొందరు తినేందుకు ఆహారం గొంతు తడుపుకునేందుకు నీరు లేక ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ బయటకు వెళ్లి ఏమైనా ఆహారం తీసుకొద్దామనుకుంటే... బయటకు వెళ్లినవారు ప్రాణాలతో తిరిగొస్తారన్న గ్యారెంటీ లేదు. తమకు ఆహారం లేదని, పిల్లలకు పాలు లేవని ఓ అంతర్జాతీయ ఛానెల్‌తో ఓ మహిళ మాట్లాడింది. రెండు వారాల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నేలపై పడుకోవాలంటే ఆమె వెన్నులో నొప్పి వేస్తోందని తెలిపింది.

 పుట్టిన బిడ్డకు పాలివ్వలేని తల్లి

పుట్టిన బిడ్డకు పాలివ్వలేని తల్లి

గత కొన్ని రోజులుగా సరైన ఆహారం లేక పుట్టిన బిడ్డకు పాలు పడటం లేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈ తల్లి తన కుటుంబ సభ్యులతో గురువారం రాత్రి ఉత్తర గాజా నగరంకు కాలినడకపై బయలు దేరి ప్రాణాలను కాపాడుకుంది. కొన్ని కిలోమీటర్లు నడిచి అల్-జదీదా స్కూలులో తలదాచుకున్నారు. ఈ స్కూలును పాలస్తీన శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి నడుపుతోంది. 2014లో గాజా యుద్ధం జరిగిన సమయంలో కూడా దాదాపు 40 రోజుల పాటు ఒక స్కూలులోనే ఆశ్రయం పొందినట్లు మరో వ్యక్తి ఉమ్ జమాల్ అల్ అత్తర్ చెప్పారు. ఆ యుద్ధంలో ఇజ్రాయిల్ సైన్యం 2100 మంది పాలస్తీనీయులను హతమార్చింది.

 పిల్లల దృష్టిని మరల్చేందుకు..

పిల్లల దృష్టిని మరల్చేందుకు..

ఉమ్ జమాల్ ఆమె భర్త నివసిస్తున్న ఇంటికి సమీపంలోని మరో ఇంటిపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి చేయడంతో భయంతో కుటుంబమంతా అటాట్రాను వీడి బెత్ లాహియా నగరంకు చేరుకున్నారు. ఆ దాడిలో వీరికి తెలిసిన మరో కుటుంబం మృతి చెందింది. ఇజ్రాయిల్ దేశం క్షిపణులతో పాటు ఏదో గ్యాస్‌ను కూడా ప్రయోగించారని ఉమ్ జమాల్ చెప్పింది. ఇక పిల్లలు భయంతో ఏడుస్తుంటే వారిని ఓదార్చి వారి దృష్టి మరల్చేందుకు బొమ్మలు ఇస్తున్నామని ఆమె చెప్పుకొచ్చింది. గత రెండు వారాలుగా గాజాపై సాగుతున్న ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో 201 మంది పాలస్తీనీయులు మృతి చెందగా ఇందులో 58 మంది చిన్నారులు, 35 మంది మహిళలున్నారు. 1300 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ దాడుల్లో ఇజ్రాయిల్‌కు చెందిన వారు 10 మంది మృతి చెందగా ఇందులో ఇద్దరు పిల్లలున్నారు.

ఇలా గాజా నగరవాసులను ఎవరిని కదిలించినా ఒక్కొక్కరి ఒక్కో దీనగాథ. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఈ యుద్ధంకు ఫల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ దాడికి తమ కుటుంబాలు బలైపోతాయో అన్న భయంతో అక్కడి ప్రజలు బతుకుతున్నారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని బాధితులకు ఆహారం, ఇతరత్ర అవసరమైన వస్తువులను సమకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Palestinians who were residing in Gaza were displaced with Izrael air strikes and are in dire want of food and water
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X