వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ముందే ఓటమిని అంగీకరించిన సజిత్ ప్రేమదాస...

|
Google Oneindia TeluguNews

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓటమిని అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పునిచ్చిన ప్రజలకు ప్రేమదాస కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక ఏడో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న గోటబాయకు కంగ్రాట్స్ తెలిపారు.

గోటబాయ రాజపక్సే లెప్టినెంట్ కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. శనివారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ముందున్నారని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫలితాలను శ్రీలంక ఎన్నికల అధికారులు ఆదివారం ప్రకటిస్తారు. వాస్తవానికి ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతే ఓటమిపై స్పందించారు. కానీ ప్రేమదాస.. తన ఓటమిని ముందుగానే అంగీకరించారు.

Sajith Premadasa concedes defeat to Gotabaya Rajapaksa

ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన కొనసాగుతున్నారు. అతని పదవీకాలం ముగియడంతో ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ముస్లిం ఓట్లు, ఈస్టర్ సండే ప్రార్థనల రోజు జరిగిన బాంబ్ దాడి.. ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న 15.9 మిలియన్ల ఓటర్లు 12 వేల 845 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. దాదాపు 80 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినిపియోగించుకున్నారు. అధ్యక్ష పదవీ కోసం 35 మంది పోటీపట్టారు. దీంతో ఎన్నికల అధికారులు 26 అంగుళాల బ్యాలెట్ పేపర్ రూపొందించారు. వీరిలో 70 ఏళ్ల గోటబాయ, 52 ఏళ్ల సజిత్ ప్రేమదాస మధ్య పోటీ నెలకొంది.

English summary
Sri Lanka's ruling party candidate Sajith Premadasa Sunday conceded the presidential poll on Sunday and congratulated his main rival, former wartime defence secretary Gotabaya Rajapaksa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X