వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.1378 కోట్లకు 'టైమ్'ను అమ్మేశారు: కొన్నది వీరే, అందుకే అమ్మేశారు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రముఖ వార్తా పత్రిక టైమ్ మేగజైన్‌ను అమ్మేశారు. సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బినీఫ్ దీనిని కొనుగోలు చేశారు. 190 బిలియన్ డాలర్లకు దీనిని కొనుగోలు చేశారు. సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనీఫ్ సతీమమి లిన్ బెనీఫ్. వీరు కలిసి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు టైమ్ మేగజైన్ మెరేడిత్ కార్ప్ చేతిలో ఉంది. ఇప్పుడు చేతులు మారుతోంది.

అయితే ఈ సంస్థను సేల్స్‌ఫోర్స్ సీఈవో వ్యక్తిగతంగా కొనుగోలు చేశారని టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వార్డ్ ఫెల్సెంథాల్ వెల్లడించారు. దీనికి సేల్స్‌ఫోర్స్‌కు సంబంధం లేదని పేర్కొన్నారు. మేగజైన్ రోజువారీ కార్యకలాపాల్లో మార్క్ బెనీఫ్ జోక్యం చేసుకోరని, ప్రస్తుతం ఉన్న ఎగ్జిక్యూటివ్ బృందం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.

Salesforce CEO Marc Benioff and his wife are buying Time Magazine

టైమ్ మేగజైన్‌తో పాటు పార్చ్యూన్, మనీ, స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ పబ్లికేషన్లను కూడా మెరిడిత్ ఈ ఏడాది మార్చిలో అమ్మకానికి పెట్టింది. ఇప్పుడు టైమ్ అమ్ముడుపోయింది. మిగతా మూడింటి విక్రయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పత్రికల్లో ప్రకటనలు తగ్గడంతో టైమ్ సహా చాలా మేగజైన్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

English summary
This time it's Salesforce CEO Marc Benioff and his wife Lynne Benioff. They are buying Time Magazine for $190 million from Meredith Corp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X