వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ ఖాన్ శిక్షపై పాక్ మంత్రి సంచలనం: జైల్లో తొలిరాత్రి, ఆశారాం భోజనం ఇస్తే తిన్నాడు

|
Google Oneindia TeluguNews

Recommended Video

సల్మాన్ ఖాన్ ముస్లీం మైనార్టీ అయినందునే జైలు శిక్ష : మంత్రి ఖ్వాజా ఆసిఫ్

లాహోర్: కృష్ణజింకలను వేటాడిన కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా పడిన నటుడు సల్మాన్ ఖాన్ అంశంపై పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందించారు. ఆయన ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. సల్మాన్ ఖాన్ ముస్లీం మైనార్టీ అయినందునే జైలు శిక్ష వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు, ఐదేళ్ల జైలు శిక్షకృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు, ఐదేళ్ల జైలు శిక్ష

భారత్‌లో ముస్లీంలను అంటరానివారిగా చేస్తారని నిందించారు. భారత్‌లోని అధికార పార్టీ ఏ మతానికి చెందినదో సల్మాన్ ఖాన్ అదే మతస్తుడు అయి ఉంటే ఇంత తీవ్రమైన శిక్ష పడి ఉండేది కాదన్నారు. కోర్టు కూడా తక్కువ శిక్ష విధించేది అన్నారు.

Salman Khan jailed because he’s minority, says Pakistan Foreign Minister Khawaja Asif

నిద్రలేని తొలిరాత్రి

సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ జైలుకు తరలించారు. సల్మాన్‌ను సాధారణ ఖైదీలానే పరిగణిస్తామని అధికారులు చెప్పారు. ఖైదీ నెంబర్ 106ను కేటాయించారు. అతని బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు తీర్పు వచ్చే అవకాశముంది. బెయిలు వస్తుందన్న ఆశతో సల్మాన్ తొలి రాత్రి గడిపాడు. జైలులో అతడికి ఓ చెక్క మంచం, నాలుగు దుప్పట్లను అధికారులు అందించారు. రాత్రి ఆయన ఆ మంచం పైనే నిద్రించినట్టు అధికారులు తెలిపారు.

జైలుకు చేరుకున్న సల్మాన్‌కు ఆయన మేనేజర్ హోటల్ తాజ్ నుంచి ఆహారం, దుస్తులు తెచ్చి ఇచ్చినట్టు వచ్చిన వార్తలను జైలు అధికారులు కొట్టి పారేశారు. అతడు వాటిని తెచ్చిన మాట వాస్తవమే అయినా దుస్తులు మాత్రమే తీసుకుని తినుబండారాలను వెనక్కి పంపించినట్లు తెలిపారు. జైలులో సల్మాన్‌కు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదన్నారు. జైలుకు వచ్చినప్పుడు అతడికి రక్తపోటు ఉందని, ప్రస్తుతం అది సాధారణ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు.

ప్రస్తుతానికి సల్మాన్ నీళ్లు తప్ప ఏమీ తీసుకోవడం లేదన్నారు. జైలు మెనూ ప్రకారం రాత్రికి భోజనంలోకి చనా పప్పు, క్యాబేజీ అందించినట్టు చెప్పారు. ఈ ఉదయం అందరితో పాటు బ్రేక్‌ఫాస్ట్, టీ, తర్వాత కిచిడీ ఇస్తామన్నారు.

ఆశారాంతో భోజనం పంచుకున్న సల్మాన్

లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న ఆశారాం బాపు పక్కనే సల్మాన్ గది ఉంది. వీరిద్దరికి మధ్య కేవలం పరదా మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. సల్మాన్ సెల్‌లో చెక్క మంచం, రగ్గు, కూలర్ మాత్రమే ఉన్నాయి. సల్మాన్‌కు జైల్లో అందించే చపాతి, పప్పు ఇవ్వగా ఆయన నిరాకరించారని తెలుస్తోంది. అయితే సల్మాన్‌ ఆశారాం బాపు ఇచ్చిన ఆహారం తీసుకున్నారని జైలు వర్గాలు తెలిపాయి. ఆశారాంకు ప్రతి రోజూ సాయంత్రం జైలుకు సమీపంలోని ఆశ్రమం నుంచి భోజనం వస్తుంది. అయితే ఆశారాం తన కోసం తెచ్చిన భోజనం అందించగా సల్మాన్‌ స్వీకరించారు. అలాగే ఆశారాం తన పరుపు ఇవ్వడానికి ప్రయత్నించగా సల్మాన్ నిరాకరించారని తెలుస్తోంది.

English summary
Pakistan's Foreign Minister Khawaja Asif on Thursday flayed the verdict of Indian court against Bollywood actor Salman Khan who has been sentenced to five years jail for poaching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X