
షాకింగ్: సిలికాన్ వ్యాలీలో మారణకాండ -తోటి ఉద్యోగుల్ని కాల్చేసిన దుండగుడు -మొత్తం 9 మరణాలు
గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ట్విటర్, అమెజాన్.. ఒకటేమిటి.. దాదాపు ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలన్నిటీకీ పుట్టినిల్లయిన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో నెత్తుటేళ్లు పారాయి. ప్రపంచ టెక్ హబ్ అయిన శాన్ జోస్ నగరంలో ఓ సాయుధుడు తన తోటి ఉద్యోగులను కిరాతకంగా హతమార్చాడు. అమెరికా సామూహిక కాల్పుల పరంపరలో తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న అతిపెద్ద ఉదంతం ఇదే కావడం విషాదకరం. వివరాలివి..
కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా ఉంటోండటం తెలిసిందే. ఇక్కడి శాన్ జోస్ సిటీలో వేలాది కంపెనీలు పనిచేస్తున్నాయి. సిటీ నడిబొడ్డున ఉండే లైట్ రైల్వే యార్డులో తాజా కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. సాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాధికార సంస్థ నేతృత్వంలో నడిచే ఈ యా ర్డులో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30కు ఈ ఉదంతం జరిగింది..

శామ్యూల్ కాసిడీ(57) అనే వ్యక్తి గత తొమ్మిదేళ్లుగా ఇక్కడి ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం షిఫ్ట్ ముగింపు సమయంలో ఉద్యోగుల సమావేశం జరుగుతున్న సమయంలో శామ్యూల్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు, వెంట తెచ్చుకున్న తుపాకితో తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్నవారంతా చెల్లాచెదురైపోయారు. అయినాసరే వదలకుండా, రెండు బిల్డింగ్స్ లో కలియతిరుగుతూ కనిపించినవాళ్లను కనిపించినట్లు కాల్పులు జరిపాడు. దాదాపు గంటపాటు బీభత్సం సృష్టించాడు.
కరోనాపై
కేంద్రం
సంచలన
ప్రకటన-గాలి
ద్వారానే
వైరస్
వ్యాప్తి-కొవిడ్
ప్రోటోకాల్స్
సవరణ,కొత్త
గైడ్
లైన్స్

కాల్పుల సమాచారం అందిన వెంటనే శాన్ జోస్ పోలీసులు, మేయర్ ఘటనాస్థలికి వెళ్లారు. రైల్వే యార్డులో నిందితుడు పనిచేసే ట్రాన్స్ పోర్ట్ కంపెనీకి చెందిన రెండు బిల్డింగ్స్ లో అక్కడక్కడా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెళ్లే సమయానికి నిందితుడు శామ్యూల్ తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్డడ్డాడు. కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోగా, నిందితుడితోకలిపి మొత్తం 9 మృతదేహాలను పోస్ట్ మార్టంకు తరలించారు. కాల్పుల్లో గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. శామ్యూల్ తోటి ఉద్యోగులను కాల్చిచంపి, బలవన్మరణానికి పాల్పడటానికి వెనకున్న కారణాలు తెలియాల్సి ఉంది.