వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహం

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాస్కో: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే కిమ్‌కు పడుతోందని పుతిన్ అభిప్రాయపడ్డారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల పలు దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు హెచ్చరించినా కిమ్ తీరులో మార్పు రావడం లేదు.

కిమ్ రూల్స్: ఫోర్న్ మూవీస్ చూసినా, జుట్టు పెంచుకొన్నా శిక్షే కిమ్ రూల్స్: ఫోర్న్ మూవీస్ చూసినా, జుట్టు పెంచుకొన్నా శిక్షే

ఉత్తరకొరియా అధినేత కిమ్‌కు బుద్దిచెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అంతేకాదు అమెరికాతో పాటు అమెరికా మిత్రదేశాలపై కిమ్ దాడులకు సన్నాహలు చేస్తున్నారు.

ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్ ప్రత్యర్థులను నాశనం చేస్తాం, హైడ్రోజన్ బాంబు రె'ఢీ' చేసిన కిమ్

అణుపరీక్షలు, ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తూ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నారు. కిమ్‌కు గతంలో మద్దతుగా వ్యవహరించిన దేశాలు కూడ ప్రస్తుతం ఆయన తీరును తప్పుబడుతున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సద్దాంకు పట్టిన గతే పడుతోంది

సద్దాంకు పట్టిన గతే పడుతోంది

ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పట్టిన గతే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు పడుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలను యుద్దం వైపుకు నడిచేలా కిమ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కిమ్ తన పద్దతిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. పద్దతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పని పరిస్థితులు నెలకొంటాయని పుతిన్ హెచ్చరించారు. అమెరికాతో యుద్ధానికి దిగితే ఉత్తరకొరియా మరొక ఇరాక్ అవుతుందని, సద్దాం హుస్సేన్‌ కు పట్టిన గతే కిమ్ జాంగ్ ఉన్‌ కు కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు.

నిర్ధేశిత లక్ష్యాన్ని అణ్వాయుధాలు చేధిస్తాయా?

నిర్ధేశిత లక్ష్యాన్ని అణ్వాయుధాలు చేధిస్తాయా?

అమెరికా ప్రధాన భూభాగాలను లక్ష్యం చేసుకుని ఉత్తరకొరియా అణుదాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ... ప్రయోగించిన తరువాత అవి నిర్దేశిత లక్ష్యంపై పడతాయన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే తనకు చెప్పారని ఆయన అన్నారు.దరిమిలా ఇతర దేశాలకు కూడ నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

హిస్టీరియాతో బాధపడుతున్న కిమ్

హిస్టీరియాతో బాధపడుతున్న కిమ్

కిమ్ జాంగ్ ఉన్ హిస్టీరియాతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. అమెరికాపై అణుదాడి చేస్తే అది తగ్గుతుందని ఆయన అనుకుంటున్నారని పుతిన్ విమర్శించారు. అయితే అది ఈ జన్మలో జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అణ్వాయుధాలు కలిగి ఉండొచ్చు

అణ్వాయుధాలు కలిగి ఉండొచ్చు

ప్రపంచంలో ఏ దేశమైనా అణ్వాయుధాలు కలిగి ఉండవచ్చని అన్నారు. అయితే వాటిని రెచ్చగొట్టేందుకు వాడకూడదని ఆయన హితవు పలికారు. ప్రపంచ వినాశనం కోసం వాటిని ఉపయోగించాలని చూస్తే ఇతరులెవరూ కూడ చూస్తూ ఊరుకొనే పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు.

English summary
Vladimir Putin, the Russian president, said on Tuesday that US-led calls for harsher sanctions on North Korea were futile and warned that military escalation could lead to a global catastrophe, arguing that Pyongyang rightfully fears for its security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X