• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జెఫ్ బెజోస్ టీమ్‌లో మరాఠీ అమ్మాయి: అంతరిక్ష విహారానికి రెడీ

|

వాషింగ్టన్: కొద్దిరోజుల కిందటే తెలుగమ్మాయి శిరీష బండ్ల.. అంతరిక్ష విహారానికి వెళ్లొచ్చారు. వ‌ర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచ‌ర్డ్ బ్రాన్స‌న్‌ టీమ్‌తో కలిసి భూవాతావరణాన్ని దాటొచ్చారు. సరిగ్గా తొమ్మిదో రోజు మరో భారతీయురాలు అంతరిక్షానికి దూసుకెళ్లనున్నారు. అపర కుబేరుడు, అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు, బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్‌తో కలిసి ఆమె అంత‌రిక్షయానం చేయనున్నారు. ఈ సారి మరాఠీ యువతి సంజ‌ల్ గ‌వాండే (Sanjal Gavande) ఈ ఘనతను సాధించనున్నారు.

సంజల్ గవాండే స్వస్థలం ముంబై. ముంబై శివార్లలోని క‌ల్యాణ్ సమీపంలో గల కోల్సెవాడిలో జన్మించారామె. తండ్రి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగి. ముంబై యూనివ‌ర్సిటీలో మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చదివారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. మిచిగాన్ టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీలో మాస్టర్స్ చేశారు. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడటంతో ఏరోస్పేస్ టెక్నాలజీపై పట్టు సాధించారు. అనంతరం విస్క‌ాన్సిస్‌లోని మెర్క్యూరీ మెరైన్ సంస్థ‌లో చేరారు. అనంతరం కాలిఫోర్నియాలోని టొయోటా రేసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించారు.

Sanjal Gavande all set to fly with Jeff Bezos Blue Origin Team to space

2016లో క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్ కూడా పొందారు. అదే సమయంలో నాసాలో ఉద్యోగానికి కూడా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు గానీ ఎంపిక కాలేకపోయారు. పౌర‌స‌త్వ స‌మ‌స్య‌లు ఏర్పడటంతో సంజ‌ల్‌ గవాండే దరఖాస్తును నాసా తిరస్కరించింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ నెలకొల్పిన బ్లూ ఆరిజిన్ సంస్థ‌లో సిస్ట‌మ్ ఇంజినీర్‌గా చేరారు. తాజాగా జెఫ్ బెజోస్ స్పేస్ టూర్‌లో భాగ‌స్వామి అయ్యారు. అంతరిక్ష ప్రయాణానికి జెఫ్ బెజోస్ వినియోగించే న్యూషెప‌ర్డ్ రాకెట్ అభివృద్ధి చేయడంలో సంజల్ కీలకపాత్ర పోషించారు.

జెఫ్‌ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్‌, ఆలిమన్‌ డేమర్‌, వాలీ హంక్‌, సంజల్ గవాండేలతో కూడిన టీమ్ న్యూ షెపర్డ్‌ స్పేస్ రాకెట్‌లో అంతరిక్ష ప్రయాణం చేయబోతోన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఉదయం 8 గంటలకు స్పేస్ జర్నీ ప్రారంభం కానుంది. టెక్సాస్‌ పశ్చిమ ప్రాంతంలోని వాన్ హార్న్ అనే టౌన్‌లో గల స్పేస్ సెంటర్ నుంచి వారి ప్రయాణం మొదలవుతుంది. 11 నిమిషాల పాటు వారు అంతరిక్షంలో విహరిస్తారు. భార రహిత స్థితిలో ఉంటారు.

English summary
Sanjal Gavande a 30-year-old woman from Maharashtra is part of the team of engineers that built Blue Origin's suborbital space rocket New Shephard, which will carry Blue Origin founder Jeff Bezos and three others to space today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X