వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్వాన్ వ్యాలీ నుంచి వెనక్కి చైనా సైన్యం, ఇవిగో ఉపగ్రహ చిత్రాలు, జూన్ 28కి జూలై 6కి తేడా...

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా దళాలు క్రమంగా వెనక్కి వెళుతున్నాయి. గత నెల 28వ తేదీన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉన్నట్టు శాటిలైట్ చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. కానీ ఈ నెల 6వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాలలో మాత్రం పీఎల్ఏ ఆర్మీ జాడ కనిపించలేదు. ఆ చిత్రాలను 'ఇండియా టుడే' విడుదల చేశాయి. సైనికులే కాదు టెంట్లు, వాహనాలు, గుడారాలు కూడా పీపీ 14 వద్ద చైనా దళాలు తీసివేశాయి.

 Satellite images confirm Chinese pullback from Galwan Valley..

మాక్సర్ టెక్నాలజీస్ వరల్డ్ వ్యూ 3 ఉపగ్రహం చిత్రాలను ఇండియా టుడేతో పంచుకున్నది. గాల్వాన్ నది పొంగిపొర్లుతున్నందున ఇదివరకు పీపీ 14 రహదారులను చైనా పున:నిర్మించిన సంగతి తెలిసిందే. రోడ్లు పాడవడంతో రీ కన్ స్ట్రక్షన్ చేసింది. అయితే ప్రస్తుతం అలాంటి నిర్మాణాలు కూడా కనిపించడం లేదు. జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణ తర్వాత చైనా ఈ పాయింట్ వద్ద తన ఆర్మీని భారీగా మొహరించింది. గుడారాలు వేసి, వాహనాల్లో సైనికులను పంపించింది.

English summary
Chinese pullback in the Galwan river valley has been confirmed by the latest satellite images reviewed by India Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X