వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీలో 88 మంది నేరస్తుల తలల నరికివేత

|
Google Oneindia TeluguNews

రియాద్: సౌదీ అరేబియాలో నేరస్తులను నిర్దాక్ష్యణ్యంగా చంపేస్తున్నారు. ఇక ముందు నేరాలు చేస్తే ఇదే పరిస్థితి ఎదురౌతుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. 2015 మే చివరి వారానికి 88 మంది నేరస్తుల తలలు నరికి వేశామని మంగళవారం సౌదీ అరేబియా అధికారులు అధికారికంగా వెల్లడించారు.

సౌదీ అరేబియాలో నేరాలు చేస్తున్న వారికి అక్కడి ప్రభుత్వం మరణ శిక్షలు అమలు చేస్తున్నది. 2014 జనవరి నెల నుండి డిసెంబర్ చివరి వరకు నేరాలు చేస్తున్న 87 మందికి శిరఛ్చేదం చేశారు. అయితే 2015 సంవత్సరం మే చివరి వారం నాటి ఆ సంఖ్య దాటి పోయింది.

ఇంకా నేరస్తులకు శిరఛ్చేదం చెయ్యవలసి ఉందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ అధికారులు అంటున్నారు. సౌదీలో మత్తు పదార్థాలు తరలించడం నిషేధం. మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న అవాద్ ఆల్- రోవైలీ, లఫీ ఆల్-షమారీ అనే ఇద్దరు యువకులు పట్టుబడ్డారు.

Saudi Arabia 88th person is put to death

మంగళవారం సౌదీ అరేబియాలోని ఉత్తర జావుఫ్ ప్రాంతంలో వీరిద్దరి తలలు నరికివేసి శిక్ష అమలు చేశారు. అదే విధంగా హత్య కేసులో మహమ్మద్ ఆల్ - షిహ్రీ అనే యువకుడు అరెస్టు అయ్యాడు. మంగళవారం నైరుతి ఆసిర్ ప్రాంతంలో ఇతని తల నరికి వేసి శిక్షను అమలు చేశారు.

మరణ శిక్షలు అమలు చేస్తున్న ప్రపంచ దేశాల జాబితాలో సౌదీ అరేబియా ఐదవ స్థానంలో ఉంది. సౌదీ అరేబియాలో నేర విచారణ సవ్యంగా జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే సౌదీ అరేబియా అధికారులు మాత్రం విచారణ సవ్యంగానే జరుగుతున్నదని సమర్థించుకుంటున్నారు.

English summary
Tuesday identified the latest prisoners to be put to death as Saudis Awad al-Rowaili and Lafi al-Shammary, who had been convicted of smuggling amphetamines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X