వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిరంగ ముద్దులు, బిగుతు దుస్తులు వద్దు: పర్యాటకులపై సౌదీ ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

రియాద్: ఇప్పుడిప్పుడే పాలనలో సంస్కరణలు తీసుకొస్తూ బయటి ప్రపంచానికి దగ్గరవుతున్న సౌదీ అరేబియా.. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే, సౌదీకి వచ్చే పర్యాటకులపై పలు ఆంక్షలను కూడా విధించింది.

19 కొత్త నిబంధనలు

19 కొత్త నిబంధనలు

సౌదీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా నడుచుకుంటే జరిమానాలు విధిస్తామని స్ఫస్టం చేసింది. వస్త్రాధారణ, ప్రవర్తన విషయంలో పర్యాటకులు పద్ధతిగా ఉండాలని 19 కొత్త నియమాలు తీసుకొచ్చింది. వీటిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఏ మేర జరిమానాలుంటాయో స్పష్టం చేయలేదు.

బిగుతూ వస్త్రాలు వద్దు..

బిగుతూ వస్త్రాలు వద్దు..

ప్రముఖ యాత్రా స్థలాల్లో, మసీదుల్లో బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించడాన్ని నిషేధించింది. సౌదీ అరేబియా పద్ధతులు, ఆచారాలు తెలియాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యటక వెల్లడించింది. 2030 నాటికి దేశ పర్యాటక రంగం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించాలన్న ఉద్దేశంతో సౌదీ తొలిసారిగా పర్యాటక వీసాలను కొద్ది రోజుల్లోనే జారీ చేయనుంది.

49దేశాలకు వీసాలు..

49దేశాలకు వీసాలు..

అమెరికా, యూరోపియన్ దేశాలతోపాటు 49 దేశాలకు ఈ-వీసా, వీసాలను జారీ చేస్తామని వెల్లడించింది. శుక్రవారం నుంచి ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించింది. అదే రోజు నుంచి వీసా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విదేశీ పర్యాటకులకు నిర్దేశించిన నిబంధనలను ఈ సైట్‌లో పొందుపర్చారు.

బహిరంగ ముద్దులకు నో..

బహిరంగ ముద్దులకు నో..

పర్యాటక మహిళలు భుజాలు కనిపించకుండా, మోకాలు కింది వరకు వస్త్రాలు ధరించాలని సౌదీ నిబంధనల్లో స్పష్టం చేసింది. సౌదీకి వచ్చే పర్యాటకులు బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోరాదని, ఇలా చేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించింది. కాగా, సౌదీ మహిళలు మాత్రం బుర్ఖా(అభయ) ధరించడం తప్పనిసరి. విదేశీ మహిళలకు ఈ బుర్ఖా నుంచి మినహాయింపు ఇచ్చారు.

English summary
Saudi Arabia on Saturday said it would impose fines for violations of "public decency", including immodest clothing and public displays of affection, a day after the austere kingdom opened up to foreign tourists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X