వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక మాకు పురుషుల అవసరం లేదు!: సౌదీ రోడ్లపై కార్లతో మహిళల సందడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు సొంతగా వాహనాలు డ్రైవింగ్ చేయడం ప్రారంభించారు. ఇక డ్రైవింగ్ విషయంలో తమకు పురుషుల అవసరం లేదంటూ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాలో గతంలో మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని నిషేధించారు. ఇప్పుడు ఎత్తివేశారు. దీంతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు.

మహిళలు కార్లను డ్రైవ్‌ చేస్తూ, కేరింతలు కొడుతూ అర్ధరాత్రి సందడి చేశారు. కార్లకు బెలూన్లను కట్టి రోడ్లపై విహరించారు. ఇతర మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు. దశాబ్దాల కాలం నుంచి అమలులో ఉన్న నిషేధం ఆదివారంతో అధికారికంగా ముగిసింది. ప్రపంచంలో మహిళల డ్రైవింగ్‌పై నిషేధం విధించిన ఏకైక దేశం సౌదీ అరేబియానే కావడం గమనార్హం.

నిషేధం ఎత్తివేత

నిషేధం ఎత్తివేత

దీని కోసం మహిళలు, హక్కుల కార్యకర్తలు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నిషేదం ఎత్తివేసిన ఉత్తర్వులు అమలైన కొన్ని నిమిషాలకే టీవీయాంకర్ సబికా ఆల్ దోసారి కారు నడిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి సౌదీ అరేబియా మహిళకు ఇది చారిత్రాత్మక సందర్భమన్నారు.

సొంత కారులో డ్రైవింగ్

సొంత కారులో డ్రైవింగ్

ముగ్గురు పిల్లల తల్లి, టీవీ యాంకర్‌ అయిన సమర్‌ తన సొంత కారులో తొలిసారిగా డ్రైవర్‌ సీట్లో కూర్చొని నడిపింది. తాను పుట్టిన ఊరిలో, తన కారులో అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. మధ్యమధ్యలో ఆమె వాహనాన్ని పలువురు మహిళలు ఆపి శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగింది.

మాకు పురుషులతో అవసరం లేదు

మాకు పురుషులతో అవసరం లేదు

డ్రైవింగ్ కోసం ఎదురుచూపులు చూడటానికి ఇక స్వస్తీ పలుకుదామని, మాకు ఇంక పురుషుల అవసరం లేదని, సొంతగా వాహనాలు నడుపుతామని 21 ఏళ్ల ఓ విద్యార్థిని అన్నారు. తాను చాలా అదృష్టవంతురాలినని, ఎంతో సంతోషంగా ఉందని, నా వాహనాన్ని నేనే నడుపుతున్నందుకు గర్వంగా ఉందని మరో 23 ఏళ్ల మహిళ అన్నారు.

నిషేధం ఎత్తివేత

నిషేధం ఎత్తివేత

గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ రాజు సల్మాన్ సంస్కరణల్లో భాగంగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల ఆరంభంలో మహిళలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అక్కడి సంస్థలు తమ కంపెనీల్లో పని చేస్తున్న మహిళలకు డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించే పనిలో పడ్డాయి. మరికొందరేమో గోకార్టింగ్‌, వీడియో గేమ్స్‌, అనుకరణ యంత్రాల ద్వారా డ్రైవింగ్‌ నేర్చుకొంటున్నారు.

English summary
Saudi women are officially allowed to get behind the wheel, after a decades-old driving ban was lifted. The change was announced last September and Saudi Arabia issued the first licences to women earlier this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X