వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనొక హిట్లర్, మేమూ అణుబాంబు సంపాదిస్తాం: సౌదీ యువరాజు సంచలన వ్యాఖ్యలు..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రియాద్ : సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో సౌదీ అరేబియా కూడా అణుబాంబును సంపాదిస్తుందని ఆయన కలకలం రేపారు. ఇటీవలే లెబనాన్‌లో పర్యటించిన ఆయన ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఆ ఇంటర్వ్యూలో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధినేత అలీ ఖమెనెయ్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్లయితే సౌదీ కూడా వీలైనంత త్వరగా అణుబాంబును సంపాదిస్తుందని వ్యాఖ్యానించారు.

Saudi Crown Prince Warns Will Develop Nuclear Weapon if Iran Does

రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్య దేశాలపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఇరాన్, సౌదీ అరేబియాలు విరోధులుగా మారాయి. పరస్పరం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Saudi Arabia will develop a nuclear bomb if its arch-rival Iran does so, the kingdom's 32-year-old crown prince said in a preview of a television interview released on Thursday. "Saudi Arabia does not want to acquire any nuclear bomb, but without a doubt if Iran developed a nuclear bomb, we will follow suit as soon as possible," Prince Mohammed bin Salman told CBS in an interview that will air on Sunday on "60 Minutes". The crown prince also doubled down on his previous comparison of the Ayatollah Khamenei to "the new Hitler" of the Middle East. "He wants to expand. He wants to create his own project in the Middle East very much like Hitler who wanted to expand at the time", Prince Mohammed said. "Many countries around the world and in Europe did not realize how dangerous Hitler was until what happened, happened. I don't want to see the same events happening in the Middle East."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X