వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 రికార్డు బద్దలు: 10 మంది పాకిస్ధానీయులకు మరణ శిక్ష

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో జనవరి నుంచి ఇప్పటి వరుకు 88 మందికి మరణ శిక్ష అమలు చేశారు. అక్రమ రవాణా చేసినందుకుగాను మంగళవారం తాజాగా ముగ్గురికి ఉత్తర ప్రాంతంలోని జాఫ్ వద్ద శిరచ్ఛేదం చేయడంతో సంఖ్య 88కి చేరుకుంది. దీంతో గతేడాది మరణ శిక్షల రికార్డును అధిగమించింది.

ఈ మరణశిక్ష అమలు ఆ దేశంలో ఆందోళనకరంగా మారుతున్నాయి. 2014లో 87 మందికి మరణ శిక్ష అమలు చేయగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే 88 మందికి మరణ శిక్ష అమలు చేసినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు.

Saudi executes 88th person this year, topping 2014 total

సౌదీ అరేబియా మరణ శిక్ష అమలు చేసిన వారిలో విదేశీయలు కూడా ఉండటంతో మరణ శిక్షల విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరగట్లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జకార్తా అంబాసిడర్ ఈ మేరకు రియాద్ అంబాసిడర్‌కు సమన్లు జారీ చేశారు.

ఈ ఏడాది మరణ శిక్ష అమలు చేసిన వారిలో 8 మంది యెమెన్‌లు, 10 మంది పాకిస్ధానీయులు, సిరియన్లు, జోర్డాన్లు, మయన్మార్, ఫిలిఫ్పేన్స్, ఇండియా, ఛాద్, సుడాన్ దేశస్తులు ఉన్నారు. తాజా మరణ శిక్షల అమలుతో ప్రపంచవ్యాప్తంగా సౌదీ అరేబియా ఐదో స్థానంలో కొనసాగుతుంది.

English summary
Saudi Arabia on Tuesday carried out its 88th execution so far this year, surpassing the total for all of 2014 despite activists' concerns that trials are not conducted fairly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X