వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో భారతీయ కార్మికులపై జరుగుతున్న అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. పని చేసే దగ్గర పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఫిర్యాదు చేసిందనే నెపంతో ఓ భారతీయ మహిళ చేతులను నరికేశారు ఆ ఇంటి యజమాని.

తమిళనాడుకు చెందిన బాధిత మహిళను కస్తూరి మునిరథినమ్‌(50)గా గుర్తించారు. గత కొంత కాలంగా ఆమె సౌదీ అరేబియా రాజధాని నగరమైన రియాద్‌లోని ఓ ఇంట్లో సహాయకురాలి(పని మనిషి)గా పని చేస్తోంది.

 Saudi horror: Indian woman’s hand chopped off by employer, MEA terms it brutal

సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యజమానుల చిత్రహింసలు భరించలేక వారి ఇంటి బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఆమె చేతులు నరికేశారు యజమాని.

కాగా, ఈ దారుణ ఘటనను భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. తాము ఇలాంటి ఘటనలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఓ భారత మహిళను ఈ విధంగా చిత్రహింసలకు గురిచేయడం తమను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు.

బాధితురాలితో భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సుష్మా తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, మూడు నెలల క్రితం సౌదీ వెళ్లిన బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

English summary
A shocking and brutal news has emerged from Saudi Arabia where an Indian woman's hand has been chopped off by her employer after she complained about poor working conditions last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X