వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ ద్వారా పెళ్ళిళ్ళు, 900 మంది పేర్లు నమోదు

వాట్సాప్ గ్రూప్ లో పేర్లు నమోదుచేసుకొని వివాహం చేసుకొనేందుకు సౌదీ అరేబియా అధికారులు ప్రణాళికలను సిద్దం చేశారు. విడాకులు తీసుకొనేవారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

సౌదీ అరేబియా :వాట్సాప్ , దీని గురించి తెలియని వారుండరు,అతి తక్కువ కాలంలోనే వాట్సాప్ అనే సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను తెలుసుకొంటున్నాం. వినోదాలు, విశేషాలు తెలుసుకోవడానికే కాదు , ఇక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడ వాట్సాప్ పనిచేయనుంది. అయితే వాట్సాప్ ద్వారా ఇక పెళ్ళిళ్ళు కూడ చేసుకొనే వెసులుబాటు కలిగింది.సౌదీ అరేబియాకు చెందిన అధికారులు వాట్సాప్ ద్వారా వివాహలు చేసేందుకు ప్లాన్ చేశారు.

సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్పాప్ ద్వారా వివాహం చేసుకొనే వినూత్న ఐడియాతో ముందుకు వచ్చింది.వివాహలు చేసుకొనే మహిళల కోసం ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు సౌదీ అరేబియా అధికారులు.

పాలిగమీ పేరుతో ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేస్తోంది.ఈ గ్రూప్ లో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల మంది తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. విడాకులు తీసుకొన్న వారు, వితంతువులు, పెళ్ళికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు.

Saudi officers created a whats app group for marriages

మక్కా పట్టణంలో ఎక్కువగా విడాకులు తీసుకొన్న ఘటనలు చోటుచేసుకొంటున్నందున అధికారులు కొత్తగా వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
సౌదీ మహిళలతో పాటు యెమెన్, మొరాకో, సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్ ,నైజీరియా, బంగ్లాదేశ్, చైనా పాకిస్తాన్ లలోని మహిళలు కూడ ఈ గ్రూప్ లో తమ పేర్లను నమోదు చేసుకొన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ లో పేర్లు నమోదు చేసుకొన్న వారు రెండు నుండి నాలుగో వివాహనికి కూడ తమ సమ్మతిని తెలుపుతున్నారు.

ఈ వాట్సాప్ గ్రూప్ లో పేర్లు నమోదు చేసుకొన్న మహిళల్లో అత్యధిక వయస్సు 55 ఏళ్ళు. అత్యల్ప వయస్సు 18 ఏళ్ళు. ఎత్తు ప్రకారంగా చూస్తే 4'7' నుండి 5'10' గా ఉన్నవారు కూడ ఉన్నారు.
తాము వివాహం చేసుకోదల్చిన అబ్బాయిలు ఎలా ఉండాలనే అభిప్రాయాలను కూడ కొందరు ఈగ్రూప్ లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉచితంగానే ఈ గ్రూప్ లో పేర్లు నమోదు చేసుకొన్నవారికి వివాహలు కుదురుస్తామని అధికారులు చెబుతున్నారు.

English summary
Saudi officers created a whats app group for marriages, over 900 members registered their names in this group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X