వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ స్మగ్లింగ్: సౌదీ యువరాజు అరెస్టు

|
Google Oneindia TeluguNews

బీరుట్: డగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో సౌదీ యువరాజును బీరుట్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సౌదీ యువరాజు అబ్దెల్ మోసెన్ బిన్ వాలిద్ బిన్ అబ్దులజిజ్ ను అరెస్టు చేశారు. అతనితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

లెబనాన్ లోని బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యాప్టగాన్ మాత్రలు, కొకైన్ ను స్మగ్లింగ్ చెయ్యడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు సుమారు రెండు టన్నుల డ్రగ్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Saudi Prince arrested in Beirut Airport

సౌదీ యువరాజుతో పాటు మరో నలుగురు బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయివేటు విమానంలో సౌదీ అరేబియాకు తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అధికారులు విషయం గుర్తించి వారిని పట్టుకున్నారు.

క్యాప్టగాన్ మాత్రలు మధ్యప్రాచ్యం దేశాలలో నిషేధించారు. ఈ మాత్రలు సిరియా ఫైటర్లు ఎక్కువగా ఉపయోగిస్తారని అధికారులు అంటున్నారు. మాదక ద్రవ్యాలను పెట్టల్లో అమర్చి సౌదీ అరేబియాకు తరలిస్తున్నారని బీరుట్ అధికారులు తెలిపారు. బీరుట్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి అని అధికారులు అంటున్నారు.

English summary
The smuggling operation is the largest one that has been foiled through the Beirut International Airport," the source said on condition of anonymity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X