వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ యువరాజుకు కొరడా దెబ్బలు, జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

దుబాయ్: కోపంలో ఒకరిని కాల్చి చంపాడన్న కారణంతో సౌదీలో ఓ యువరాజుకు ఇటీవల మరణ శిక్ష విధించారు. తప్పు చేసిన మరో యువరాజును కూడా తాజాగా తీవ్రంగా శిక్షించారు. అల్ సౌద్ రాజవంశీకుల పాలనతో ఉన్న సౌదీ అరేబియాకు ప్రస్తుతం సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాజుగా ఉన్నారు.

Saudi prince given lashes in prison as punishment

పెద్ద కుటుంబం కావడంతో యువరాజుల సంఖ్య కూడా ఎక్కువే. ఆ యువరాజుల్లో ఒకరైన తుర్కీ బిన్ సౌద్ అల్ కబీర్.. ఓ వ్యక్తిని చంపిన కారణంగా మరణ శిక్షకు గురయ్యాడు. ఇటీవలే చోటు చేసుకున్న ఈ ఘటన సర్వత్రా చర్చనీయంశమైంది.

అది మరవకముందే జెడ్డాలో ఓ యువరాజుకు కఠిన శిక్ష విధించారు. నేరం చేసినందుకు సోమవారం నాడు జైలులో కొరడాలతో చితకబాది, ఓ గదిలో పడేశారు. ఆ యువరాజు చేసిన నేరం ఏమిటనేది వెల్లడి కాలేదు. శిక్ష తాలుకూ వివరాలు మాత్రమే వెల్లడించారని చెబుతున్నారు. కనీసం రెండువారాల పాటు అతను జైలులో ఉంటాడని సౌదీ న్యాయశాఖ తెలిపింది.

English summary
Saudi court sentences member of the royal family to be flogged in prison for unspecified offence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X