వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీలో సల్మాన్ పగ్గాలు: 11 యువరాజులు, మంత్రుల అరెస్ట్

పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వ అరెస్టు చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రియాద్: పదకొండు మంది యువరాజులుతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఓ బిలియనీర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్టు చేసింది. రాజుగా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం కొత్త అవినీతి నిరోధక కమిషన్‌ను సౌదీ ప్రారంభించింది. కమిషన్‌ కొలువుదీరిన కొద్ది గంటల్లోనే ఈ అరెస్టులు జరిగాయి.

ఈ అరెస్టులకు ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న సౌదీ నేషనల్‌ గార్డ్‌ హెడ్‌, నేవీ చీఫ్‌, ఆర్థిక శాఖ మంత్రులను సల్మాన్‌ పదవుల నుంచి తొలగించారు. కొత్త కమిషన్‌ పాత కేసులను తిరగదోడిన నేపథ్యంలోనే ఈ అరెస్టులు జరిగాయని సౌదీ ప్రభుత్వ మీడియా సంస్ధ 'అల్‌ అరేబియా' పేర్కొంది. అత్యుత్తమ స్ధానాల్లో ఉండి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన వ్యక్తులను ప్రభుత్వం వదిలిపెట్టబోదని ఈ సందర్భంగా తెలిపింది.

Saudi Princes, Ex-Ministers Arrested, Officials Sacked In Sweeping Purge

అవినీతికి పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సౌదీ సర్కార్ ఈ ఘటనతో మరోసారి రుజువు చేసింది. ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేస్తూ ప్రజల సొమ్మును దోచుకొంటున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకొన్నారు.

English summary
Saudi Arabia arrested 11 princes, including a prominent billionaire, and dozens of current and former ministers, reports said, in a sweeping crackdown as the kingdom's young crown prince consolidates power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X