వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుకుదనం, తెగువ, సాహసం కలబోస్తే.. సౌదీ యువరాజు, అరబ్‌ దేశాల్లో వణుకు..

సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబిఎస్‌) పేరు అరబ్‌ దేశాల్లోనే కాదు, ప్రపంచమంతా మార్మోగుతోంది. గల్ఫ్‌ దేశాలు కాస్త భయపడుతున్నాయి కూడా..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రియాద్‌: సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ (ఎంబిఎస్‌) పేరు అరబ్‌ దేశాల్లోనే కాదు, ప్రపంచమంతా మార్మోగుతోంది. గల్ఫ్‌ దేశాలు కాస్త భయపడుతున్నాయి కూడా.. ఎందుకో తెలుసా?

ప్రిన్స్ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ వయసు కేవలం 32 ఏళ్లే. అయితేనేం, ఆయన మాటల్లో లౌక్యంతో నిండిన కరుకుదనం ధ్వనిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే తెగువ ఆయన రక్తంలో ఉంది. సొంత వారిని కూడా లెక్కచేయకుండా దూసుకుపోవడం ఆయన నైజం.

తండ్రికి సలహాదారుగా రాజకీయాల్లోకి...

తండ్రికి సలహాదారుగా రాజకీయాల్లోకి...

1985 ఆగస్ట్‌ 31 న జన్మించిన మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ మొదట్నుంచీ ఆధునిక భావాలతో పెరిగాడు. కింగ్‌ సౌద్‌ యూనివర్సిటీలో కామర్స్‌లో పట్టభద్రుడయ్యాక 2009లో తండ్రికి సలహాదారుగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2015లో రాజు అబ్దుల్లా మరణం తర్వాత రాజరిక పగ్గాలు చేపట్టిన సల్మాన్‌ వెనువెంటనే మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ రక్షణ మంత్రిగా చేశాడు.

పెద్దన్న స్థానంలో యువరాజుగా...

పెద్దన్న స్థానంలో యువరాజుగా...

రాజు సల్మాన్‌కు ముగ్గురు భార్యలు.. మూడో భార్య ఫాహ్ద బిన్‌ ఫాలా హత్లీన్‌ కొడుకే మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ. ఇతడి పెద్దన్న మొహ్మద్‌ బిన్‌ నయీఫ్‌ మాదకద్రవ్యాలకు బానిసై ఓసారి ఆత్మహత్యాయత్నం కూడా చేయడంతో 2015 జనవరి 23న అతనిని తొలగించి యువరాజుగా ఈయనకు పట్టాభిషేకం చేశాడు రాజు సల్మాన్‌.

సొంత వారని కూడా చూడలేదు...

సొంత వారని కూడా చూడలేదు...

మొదటినుంచీ అధికార కాంక్ష ఎక్కువగా ఉన్న ప్రిన్స్ ఎంబీఎస్‌ క్రమంగా తన పట్టు పెంచుకుంటూ వచ్చాడు. సౌదీకి రాజైన తన తండ్రి సల్మాన్‌కు వయసు పైబడడం, రాచరిక వ్యవస్థ అవినీతి ఊబిలో కూరుకుపోవడంతో సౌదీలో అధికారాన్ని ప్రిన్స్ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థపై దండెత్తాడు. తానే ఛైర్మన్‌గా అవినీతి- నిరోధక గ్రూప్‌ ను ఏర్పాటు చేశాడు. ఇటీవల 11 మంది యువరాజులు, రాజరిక బంధువులు, అనేకమంది మత పెద్దలు, వాణిజ్యవేత్తలు, అధికారులను కటకటాల్లోకి కూడా నెట్టాడు. ప్రస్తుతం వారంతా రియాద్ లోని ‘ది రిట్జ్ కార్ల్‌టన్'లో బందీలుగా ఉన్నారు.

ఇరాన్ పై పరోక్ష యుద్ధం...

ఇరాన్ పై పరోక్ష యుద్ధం...

యెమెన్‌లో ఇరాన్‌-అనుకూల హౌథీ రెబెల్స్‌ పై సైనిక చర్య కు చొరవ చూపింది కూడా ఇతడే. గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ) లోని దేశాలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి సంయుక్త సైనిక చర్య ప్రారంభించాడు. ఇప్పటిదాకా పదివేల మందికి పైగా తిరుగుబాటుదారులను హతమార్చి ఇంకా ఆ దాడులను కొనసాగిస్తున్నాడు. ఇరాన్‌తో పరోక్ష యుద్ధం కొనసాగిస్తున్న ఈ యువరాజు ధైర్యం ఒకటే.. అమెరికా తన వెంట ఉండడం. అయితే అమెరికా కన్ను సౌదీ దగ్గరున్న అపార చమురు సంపద పై ఉంది.

అభినందించిన ట్రంప్...

అభినందించిన ట్రంప్...

మరోవైపు ప్రిన్స్ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీ తీసుకున్న అవినీతి-వ్యతిరేక ప్రక్షాళనను అభినందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌- 2 లక్షల కోట్ల డాలర్లకు టెండర్‌ పెట్టారు. ప్రస్తుతం రాజ వంశానికి చెందిన వారెవ్వరినీ ఎంబీఎస్‌ తన దరి చేరనివ్వడం లేదు. అరెస్ట్‌ చేసిన ఒక యువరాజు అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ ఫాద్‌ - కస్టడీలో చనిపోయారని ఓ వార్త వచ్చినప్పటికీ అందులో నిజం లేదని సౌదీ టెలివిజన్‌ ప్రకటించింది. ఓ యువరాజు కొడుకు- తుర్కి బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ ఫాద్‌ దేశం విడిచి పారిపోయినట్లు తాజా సమాచారం.

English summary
ig things are happening in Saudi Arabia. Princes, ministers and top businessmen are being arrested, detained in a luxury hotel, accused of corruption, their planes grounded and their assets seized.The driving force behind this is 32-year-old Crown Prince Mohammed Bin Salman, who also heads the newly formed anti-corruption committee. So what's this all about? Is it really about corruption or is it nothing more than a power grab by Crown Prince Mohammed bin Salman? The answer is it's both.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X