వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగస్వామి ఫోన్‌ను రహస్యంగా చూస్తే ఇక జైలుకే, ఎందుకో తెలుసా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్: తమ భాగస్వామి ఫోన్‌ను రహస్యంగా చూస్తే ఇక భారీగా జరిమానాను విధిస్తారు. అంతేకాదు జైలు జీవితాన్ని కూడ ఎదుర్కోవాల్సి వస్తోందని సౌదీ అరేబియా కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని స్త్రీ, పురుషులకు సమానంగా వర్తింపజేస్తామని ఆ దేశం సాంస్కృతిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

భార్య లేదా భర్త ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడుతున్నారో, లేక సంబంధాలు కలిగి ఉన్నారోననే విషయాలను తెలుసుకొనేందుకు అప్పుడప్పుడూ రహస్యంగా తమ భాగస్వాముల ఫోన్లను చెక్ చేస్తుంటారు. అయితే ఈ తరహ ఘటనలు ఇక దుబాయ్‌లో తీవ్ర శిక్షలకు కారణమయ్యే అవకాశం ఉంది.

వ్యక్తుల నైతిక విలువలను కాపాడేందుకు, వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ ప్రకటించింది.

 Saudi residents could face prison time for spying on spouse’s mobile phone

విడాకులు తీసుకొనేందుకు ఎక్కువగా ఇటీవల కాలంలో ఫోన్ సాక్ష్యాలను దుబాయ్‌లో ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. యాంటీ సైబర్‌క్రైమ్‌ లా పేరుతో ఈ ఆదేశాలను తీసుకొచ్చారు. జీవిత భాగస్వామ్యుల ఫోన్లను రహస్యంగా చూస్తే భారీగా జరిమానాను విధించనున్నారు. అంతేకాదు అవసరమైతే కొన్ని కేసుల్లో 1,33,000 డాలర్ల జరిమానాను కూడ విధించాలని నిర్ణయం తీసుకొంది దుబాయ్ ప్రభుత్వం. ఏడాదిపాటు జైలు శిక్ష కూడ విధించనున్నట్టు ఆ దేశ సాంస్కృతిక శాఖ ప్రకటించింది.

వ్యక్తిగత వివరాలను రహస్యంగా తెలుసుకొని బెదిరింపుకుల పాల్పడుతున్న ఘటనలు కూడ ఎక్కువగా ఈ దేశంలో ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా దుబాయ్ సాంస్కృతిక శాఖ ప్రకటించింది.

English summary
Saudi Arabia has reportedly announced a new law that criminalises the act of spying on your spouse’s mobile phone and has listed this act under cybercrimes, according to Arab News.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X