హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సౌదీ టూ కామారెడ్డి..: ప్రేమించినవాడి కోసం వచ్చేసిన యువతి, ఎట్టకేలకు 'నిఖా'!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసు పెట్టిన తండ్రికి షాకిచ్చిన పోలీసులు

హైదరాబాద్: అతను సౌదీలో ఓ కారు డ్రైవర్.. ఆమె ఓ బడా కుటుంబానికి చెందిన గారాలపట్టీ.. ఆ కారు డ్రైవర్ నడవడిక చూసి ఆమెకు అతనిపై ప్రేమ కలిగింది. అదే మాట అతనితో చెబితే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడ్డాడు. కానీ అన్నింటికి తానే ముందుండి ఎట్టకేలకు ఆమె అతన్నే వివాహం చేసుకుంది. ఇందుకోసం పుట్టిన గడ్డ సౌదీని సైతం వదిలి ఇండియా వచ్చేసింది. సినిమాల్లో ప్రేమ కథలను తలపిస్తున్న ఈ కథ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

 ఏంటీ ప్రేమ కథ

ఏంటీ ప్రేమ కథ

కామారెడ్డికి చెందిన అజీబుద్దీన్‌ అనే యువకుడు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ నసీర్ అనే ఓ బడా వ్యాపారి వద్ద కారు డ్రైవరుగా చేరాడు. ఇదే క్రమంలో అజీబుద్దీన్ నడవడిక నసీర్ కూతురిని ఆకర్షించింది. అతన్ని ప్రేమించింది. మొదట ఆ విషయం అజీబుద్దీన్ తో చెప్పినప్పుడు అతను చాలా కంగారుపడ్డాడు. నీకు నాకు సెట్ కాదనే చెప్పాడు. కానీ ఆమెనే అతనికి ధైర్యం చెప్పించి ఒప్పించింది.

ముందు అతన్ని పంపించి..

ముందు అతన్ని పంపించి..

సౌదీలో ఉంటే ఇద్దరు పెళ్లి చేసుకోవడం కష్టం కాబట్టి ఇండియా వచ్చేయాలనుకున్నారు. ఈ క్రమంలో మొదట ఆ యువతి.. అజీబుద్దీన్ ను ఆర్నెళ్ల క్రితం ఇండియా పంపించింది. దీంతో అతను తన స్వస్థలమైన కామారెడ్డికి చేరుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి.. ఆమె కూడా ఇండియా వచ్చేసింది.

 గత నెలలో నిఖా

గత నెలలో నిఖా

సౌదీ నుంచి నేరుగా ఢిల్లీ విమానశ్రయంలో దిగితే తన తండ్రికి తెలిసినవారు గుర్తుపడుతారని యువతి భావించింది. దీంతో సౌదీ నుంచి నేపాల్ వెళ్లి అక్కడినుంచి ఇండియాలో అడుగుపెట్టింది. ఢిల్లీ చేరుకున్నాక అజీబుద్దీన్ కి ఫోన్ చేసి తాను వచ్చిన విషయం చెప్పింది. దీంతో అతను ఢిల్లీ వెళ్లి ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో గత నెల రెండో వారంలో వారిద్దరు 'నిఖా' చేసుకున్నారు.

 కేసు పెట్టిన తండ్రి..

కేసు పెట్టిన తండ్రి..

వివాహం తర్వాత యువతి తన తండ్రికి ఫోన్ ద్వారా విషయం చేరవేసింది. దీంతో హైదరాబాద్ చేరుకున్న నసీర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అజీబుద్దీన్ తనను కిడ్నాప్ చేయలేదని ఇష్టపూర్వకంగానే నిఖా జరిగిందని యువతి పోలీసులతో తెలిపింది. పైగా వారిద్దరు మేజర్లు కావడంతో బలవంతంగా తీసుకురావడం కుదరదని నసీరుద్దీన్‌కు చెప్పారు. దీంతో చేసేదేమి లేక ఆమె తండ్రి వెనుదిరిగినట్టు సమాచారం.

English summary
A saudi woman married Telangana man who is Kamareddy resident. She does't say anything to his father while she coming to India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X