వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌదీ రాజసౌధం లక్ష్యంగా క్షిపణి దాడి! మా పనే అన్న హౌతీ రెబల్స్..

సౌదీ అరేబియా రాజసౌధం లక్ష్యంగా మంగళవారం సాయంత్రం క్షిపణి దాడి జరిగింది. రియాద్‌లోని అల్‌యమ్మా రాయల్‌ ప్యాలెస్‌పై ‘ది వల్కినో 2-హెచ్‌ బాలిస్టిక్‌’ మిసైల్‌ను ప్రయోగించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రియాద్‌: సౌదీ అరేబియా రాజసౌధం లక్ష్యంగా మంగళవారం సాయంత్రం క్షిపణి దాడి జరిగింది. రియాద్‌లోని అల్‌యమ్మా రాయల్‌ ప్యాలెస్‌పై 'ది వల్కినో 2-హెచ్‌ బాలిస్టిక్‌' మిసైల్‌ను ప్రయోగించారు.

ప్రమాదాన్ని గుర్తించిన సౌదీ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ సకాలంలో స్పందించి క్షిపణిలక్ష్యాన్ని చేరుకోకముందే దానిని నిర్వీర్యం చేసింది. క్షిపణి దాడితో సౌదీ వివాదంలో కొత్త అధ్యాయం మొదలైందని హౌతీ రెబల్స్‌ ప్రకటించారు.

saudi-palace-missile

హఠాత్తుగా జరిగిన క్షిపణి దాడితో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజసౌధం సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. సౌదీ రాజు సల్మాన్‌ తరచూ ఇక్కడికి వస్తుంటారు.

ప్రతివారం ప్రభుత్వ అధికారులతో, విదేశీ అతిథులతో ఆయన ఇక్కడే సమావేశం అవుతుంటారు. ఈ నేపథ్యంలో రాజునే లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిందని భావిస్తున్నారు. సౌదీపై క్షిపణి దాడి జరగడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి.

ఈ దాడి ఘటనపై హౌతీ రెబల్స్‌ స్పందించారు. రెబల్స్‌ నాయకుడు అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ హౌతీ మాట్లాడుతూ 'మా క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచాం. ఇప్పుడు మా హస్తం సౌదీ ప్యాలెస్‌ వరకు చేరుకుంది. దేవుడు కరుణించాడు..' అని వ్యాఖ్యానించారు.

English summary
The Saudi-led coalition fighting Yemen's Shiite rebels said it intercepted a missile fired over southern Riyadh on Tuesday, which the rebels said was targeting a "top leadership" meeting at the royal palace in the kingdom's capital, Riyadh. It was the second time in as many months that a rebel projectile had reached as far inside the kingdom as Riyadh. The Yemeni rebels, known as the Houthis, said they launched a ballistic missile to target Yamama Palace in Riyadh, where King Salman chairs weekly government meetings and receives dignitaries and heads of state from around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X