వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టు ఖషోగ్గి హత్యలో సంచలన కథనం...చంపిన తర్వాత సౌదీ ఈ దారుణానికి పాల్పడిందా..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచదేశాల్లో చర్చనీయాంగా మారిన ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య మరోసారి వార్తల్లో నిలిచింది. సౌదీ అరేబియానే హత్య ఖషోగ్గిని హత్య చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖతార్‌లోని అల్‌జజీరా అనే అంతర్జాతీయ మీడియా ఖషోగ్గి గురించి నివ్వెరపోయే కథనాన్ని తన ఛానెల్‌లో ప్రసారం చేసింది. దీంతో ఖషోగ్గి హత్య మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఖషోగ్గి హత్య తర్వాత ఓవెన్‌లో వేసి కాల్చిన సౌదీ..?

ఖషోగ్గి హత్య తర్వాత ఓవెన్‌లో వేసి కాల్చిన సౌదీ..?

సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై అమెరికాకు చెందిన జర్నలిస్టు ఖషోగ్గిని ఆదేశమే హత్యచేసిందనే ఆరోపణలు గతేడాది వచ్చాయి. ఖషోగ్గి హత్యకు గురయ్యారన్న విషయం తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఖషోగ్గి హత్యలో సౌదీరాజు హస్తం ఉందని పలు దేశాలు కూడా ఆరోపించాయి. ఆ తర్వాత కొంత కాలానికి విషయం సైలెంట్ అయిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఖషోగ్గిని చంపిన తర్వాత సౌదీ అరేబియా ఓవెన్‌లో వేసి కాల్చిందని ప్రముఖ మీడియా అల్‌జజీరా ఓ కథనం ప్రసారం చేసింది. ఇదే కనుక నిజమైతేటే అగ్రరాజ్యం అమెరికా సౌదీపై కన్నెర్ర చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

 ఆనవాలు కనిపించకుండా ఓవెన్‌లో మూడురోజుల పాటు మాంసం వండిన సౌదీ

ఆనవాలు కనిపించకుండా ఓవెన్‌లో మూడురోజుల పాటు మాంసం వండిన సౌదీ

సౌదీ కాన్సులేట్ జనరల్ నివాసంలో ఓ పెద్ద ఓవెన్ ఉందని అది ఇనుమును సైతం కరిగించగల సామర్థ్యం ఉన్నదని అందులోనే ఖషోగ్గి మృతదేహాన్ని వేసి కాల్చి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోందంటూ కథనం ప్రసారం చేసింది ఆల్‌జజీరా ఛానెల్. ఇదే నిజమైతే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని ఆ కథనం తెలిపింది. ఖషోగ్గిని ఓవెన్‌లో ఉంచి దహనం చేశాక ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా వరుసగా మూడురోజుల పాటు ఆ ఓవెన్‌లో మాంసం వండినట్లు అల్ జజీరా ఛానెల్ పేర్కొంది. ఆ ఓవెన్‌లో ఖషోగ్గికి సంబంధించి ఎలాంటి ఆనవాలు దొరక్కుండా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగానే మాంసం వండారనే కథనాన్ని అల్‌జజీరా ప్రసారం చేసింది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన విచారణాధికారులు కూడా విచారణ చేసేందుకు వెళ్లిన సమయంలో కాన్సులేట్ గోడలపై ఖషోగ్గికి చెందిన రక్తపు మరకలు గుర్తించారు. ఖషోగ్గిని చంపిన తర్వాత హంతకులు గోడపై మరకలు కనిపించకుండా పెయింట్ వేశారు. విచారణాధికారులు వెళ్లి ఆ పెయింట్‌ను తొలగించగా కింద రక్తపు మరకలు కనపించినట్లు గతేడాది అక్టోబర్ 2న వాషింగ్టన్ పోస్టు తన కథనంలో వెల్లడించింది.

యూఎన్ విచారణలో పొంతనలేని సమాధానాలు ఇచ్చిన సౌదీ

యూఎన్ విచారణలో పొంతనలేని సమాధానాలు ఇచ్చిన సౌదీ

సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌కు వ్యతిరేకంగా ఈ అమెరికా జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాసినందునే ఆయన్ను సౌదీ అరేబియా హత్య చేసిందని టర్కీ ఆరోపించింది. జమాల్ ఖషోగ్గి టర్కీ దేశీయుడైనప్పటికీ ఆయన అమెరికాలో నివసించేవారు. అమెరికా మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేసేవారు. టర్కీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని సౌదీ అరేబియా చెప్పుకొచ్చింది. అయితే ఖషోగ్గి హత్యకు సంబంధించిన కేసులో ఇప్పటివరకు 11 మందిని నిందితులుగా పేర్కొంది టర్కీ. ఇక ఖషోగ్గి హత్యకు సంబంధించి ఆగ్నస్ కాలమార్డ్ అనే ఆమెను విచారణ చేయాల్సిందిగా ఐక్యరాజ్య సమితి కోరింది. ఖషోగ్గి హత్యగావించబడ్డాడు అని నిర్థారణకు రాకముందు సౌదీ అరేబియా అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అయితే ఆమె విచారణలో ఖషోగ్గిది దారుణ హత్య అని టర్కీకి వెల్లడించింది. అయితే ఇంకా తుది నివేదిక సమర్పించాల్సి ఉంది.

ఇనుమును కరిగించగల వెయ్యిడిగ్రీల టెంపరేచర్‌

ఇనుమును కరిగించగల వెయ్యిడిగ్రీల టెంపరేచర్‌


ఇక ఖషోగ్గి హత్య తర్వాత అతన్ని కాల్చారు అనే వాదన కొత్త కాదు. ఆయన హత్య తర్వాత ఆయన మృతదేహాన్ని కాల్చారని చెప్పేందుకు సౌదీ పోలీసులు ఇచ్చిన నివేదికను టర్కీ న్యూస్ ఏజెన్సీ ఒకటి బయటపెట్టింది. ఖషోగ్గి హత్యగావించ బడిన చోటులో రెండు ఓవెన్లు, గ్యాస్, వుడ్ ఫ్లోరింగ్ ఉందని ఆ ఓవెన్ ఉష్ణోగ్రత దాదాపు 1000 డిగ్రీలు ఉంటుందని న్యూస్ ఏజెన్సీ కూడా కథనం ప్రచురిచింది. అంటే ఇనుమును కూడా ఆ ఉష్ణోగ్రతకు కరగగలదు. ఇదే ఓవెన్‌లో ఖషోగ్గిని కాల్చారని తాజాగా ఖతార్‌కు చెందిన అల్‌జజీరా ఛానెల్ కథనం ప్రసారం చేయడం కలకలం సృష్టిస్తోంది. ఈ హీట్ అగ్రరాజ్యం అమెరికా, సౌదీల మధ్య ఎలాంటి చిచ్చు పెడుతోందో చూడాలి.

English summary
A furnace gaping beneath overhanging leaves in a paved Istanbul yard could hide a terrifying secret -- the final cruelty meted out to a dissident journalist.A report by Al-Jazeera, a television channel based in Qatar, lays out the ghastly details: After Jamal Khashoggi was killed by Saudi operatives inside Riyadh's consulate in October, his body was likely incinerated in that oven.This disposal, if it happened, is blood-curdling not just because of the fate of its victim but also for its location.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X