వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాలలే లక్ష్యంగా దాడులు: 160 మంది విద్యార్ధులు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

జెనీవా: సిరియాలో గత ఏడాది పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్ధులు మరణించారని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. స్కూలు పిల్లలపై 68 సార్లు దాడులు జరిగాయని, ఈ దాడుల్లో సుమారు 343 మంది చిన్నారులు గాయపడ్డారని యునిసెఫ్ అధికార ప్రతినిధి క్రిస్టోఫే బౌలిరాక్ వెల్లడించారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ప్రశాంతంగా ఉండాల్సిన పాఠశాలలపై దాడి చేసి మారణహోమం సృష్టించడం దారుణమని పేర్కొన్నారు. సిరియాలో 13 నుంచి 16 లక్షల మంది చిన్నారులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సిరియాలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రజా యుద్ధంలో 2 లక్షల మంది వరకు మరణించారని అన్నారు.

School attacks killed 160 Syrian children says UN

దేశంలోని చిన్నారులపై ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులైన జిహాదీల ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 6,70,000 మంది చిన్నారులపై ఈ ప్రభావం ఉంటుంది ఐక్యరాజ్య సమితి ఆవేదన చెందుతోంది.

తాజా ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రజా యుద్ధం ద్వారా ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభావితం చేయబడగా, 1.7 మిలియన్ పిల్లలు ఇంకా శరణార్ధులుగా నివసిస్తున్నారని తెలియజేస్తున్నాయి.

భారత్‌కు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ వారంలో భారత్ రానున్నారు. భారత్ అభివృద్ధిపై ఆయన చర్చలు జరిపేందుకు రానున్నట్లు బాన్ కీ మూన్ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ వివరాలు తెలిపారు.

జనవరి 10న ఆయన గుజరాత్ వెళతారని, అక్కడ 'వైబ్రాంట్ గుజరాత్' సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో బాన్ కీ మూన్ ప్రపంచ నేతలు, సిద్ధాంతకర్తలు, వాణిజ్య వర్గ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారని డుబారిక్ మీడియాకు తెలిపారు. జనవరి 13న భారత్‌లో ఆయన పర్యటన ముగుస్తుందని చెప్పారు.

English summary
At least 160 children died in attacks on schools in war-ravaged Syria last year and the education of 1.6 million has been cut short by the fighting, the UN said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X