వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంకెల గారడీ: సూసైడ్ హెల్ప్ లైన్‌కు కాల్ చేస్తే ఆ కొంపకు కనెక్ట్ అయ్యింది

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: పాఠశాల ఐడీ కార్డుపై యాజమాన్యం ఫోన్‌నెంబర్‌లోని ఓ అంకె తప్పుగా ముద్రించడంతో పెద్ద తప్పిదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో న్యూ విస్తా మిడిల్ స్కూళ్లో చదివే విద్యార్థిని ఎమిలీ తన ఐడీ కార్డుపై ఉన్న సూసైడ్ హాట్‌లైన్‌కు ఫోను చేసింది. అయితే అవతల వైపు ఫోను ఎత్తిన వ్యక్తి నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కయ్యింది. సూసైడ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే ఆ ఫోను సెక్స్ హాట్‌లైన్‌కు కనెక్ట్ అయ్యింది.

ఈ విషయాన్ని తన తల్లి జనేన్ దృష్టికి తీసుకురావడంతో అసలు సంగతి వెలుగు చూసింది.సూసైడ్ నెంబర్‌కు తాను ఫోన్ చేయగా ఆ నెంబరు సెక్స్ హాట్‌లైన్‌కు కనెక్ట్ అయ్యిందని విద్యార్థి ఎమిలీ చెప్పింది. అంతేకాదు తన ఐడీ కార్డుకు వెనక ముద్రించి ఉన్న నెంబర్‌ను కూడా చూపించింది. అయితే స్కూలు యాజమాన్యం ఒక అంకెను తప్పుగా ముద్రించింది. అదే అంకె మారడంతో ఆ లైన్ కాస్త సెక్స్ హాట్‌లైన్‌కు కనెక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఎమిలీ తల్లి జానేన్. ఒకవేళ ఎవరైనా నిజంగానే ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఐడీ కార్డు వెనక ఉన్న నెంబరు డయల్ చేసి సహాయం చేయాలంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

School girl calls Suicide hotline, but ends up getting connected to sex hotline

తప్పుడు నెంబరు ముద్రించిన స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈ ఐడీ కార్డు ఎమిలీ గాథ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో పోస్టు వైరల్‌ అయ్యింది. స్కూలు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పిన చిన్నారి... జిల్లా విద్యాధికారులు స్పందించి వెంటనే ఐడీ కార్డులను మార్చి వేశారని చెప్పింది.

School girl calls Suicide hotline, but ends up getting connected to sex hotline

అంతేకాదు క్షమాపణలు కూడా జిల్లా విద్యాశాఖ కోరినట్లు ఎమిలీ వెల్లడించింది. ఐడీ కార్డుకు వెనక ఉన్న ఎమర్జెన్సీ నెంబర్లలో సూసైడ్ హెల్ప్ లైన్‌ నెంబర్‌లో ఒక అంకె మారిందని అది సెక్స్ హాట్‌లైన్ నెంబర్ అని విద్యాశాఖ అధికారులు ధృవీకరించారు. ఇక ఐడీ కార్డులను విద్యార్థుల నుంచి తీసుకున్నట్లు చెప్పిన స్కూలు యాజమాన్యం త్వరలోనే పొరపాట్లు లేకుండా కొత్త ఐడీ కార్డులు ముద్రించి విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.

English summary
A middle school student who dialed a phone number listed for a suicide hotline on the back of her student ID was in for a shock after she was connected not to a crisis manager, but to a sex hotline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X