వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ బారినపడిన శ్వాసకోశ కణాలు ఇలా: శాస్త్రవేత్తలు విడుదల చేసిన చిత్రాలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: కరోనా మహమ్మారి మానవ శరీరంపై ఏ విధంగా ఉంటుందనే విషయంపై శాస్త్రవేత్తలు మరో కీలక అంశాన్ని కనుగొన్నారు. కరోనావైరస్ సోకిన వ్యక్తి శ్వా సకోశ కణాల ఫొటోలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్ ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందనే విషయాన్ని ఈ చిత్రం తెలియజేస్తోంది.

శ్వాసనాళాల నుంచి శరీరమంతటా..

శ్వాసనాళాల నుంచి శరీరమంతటా..

సార్స్-కోవ్-2 శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో ఇన్ఫెక్షన్ చేస్తుందనేది సులభంగా తెలుసుకునేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు.మానవ శ్వాసనాళాల్లో పెద్ద సంఖ్యలో చేరిన కరోనావైరస్ కణాలు శరీరమంతటా వ్యాపించడంతోపాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు గుర్తించారు.

వెంట్రుకల మాదిరి కణాలు..

వెంట్రుకల మాదిరి కణాలు..

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ శ్వాసనాళాల్లో కరోనావైరస్‌ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. రంగులద్దిన ఈ చిత్రాలు శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతోపాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర భాగాలకు వ్యాపింపజేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కరోనాకు అడ్డుకట్ట.. మాస్కులే రక్ష

కరోనాకు అడ్డుకట్ట.. మాస్కులే రక్ష

అత్యధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కరోనావైరస్ నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు గుర్తించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా నివాసం ఉన్న వైరస్ కణాలని పరిశోధకులు కనుగొన్నారు. కరోనా సంక్రమణను అడ్డుకునేందుకు మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్కులు ధరించడం ద్వారా మొదట శ్వాసనాళాల్లోకి ఈ వైరస్ వెళ్లకుండా అడ్డుకోగలిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై అనేక పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా శరీరంలోని దాదాపు అన్ని కణాలపై ప్రభావం చూపుతోంది.

English summary
Scientists have produced images of the novel coronavirus infecting lab-grown respiratory tract cells, findings that illustrate the number of virus particles that are produced and released per cell inside the lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X