వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా షాకింగ్: ‘మలం-అపానవాయువు’ ద్వారా కూడా వ్యాప్తి, ఇదొక్కటే మార్గమని శాస్త్రవేత్తలు

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మందికిపైగా ప్రాణాలు తీసిన కరోనావైరస్ ఇంకా విృంభిస్తుూనే ఉంది. భారీ ప్రాణ నష్టంతోపాటు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. కరోనా వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయోగాలు చేస్తున్నాయి.

Coronavirus: బర్త్ డే రోజు పూరీలు తినాలని, కేక్ కట్ చెయ్యాలని, కరోనా క్వారంటైన్ లో, పాపం అంతే !Coronavirus: బర్త్ డే రోజు పూరీలు తినాలని, కేక్ కట్ చెయ్యాలని, కరోనా క్వారంటైన్ లో, పాపం అంతే !

షాకింగ్ రీసెర్చ్..

షాకింగ్ రీసెర్చ్..

అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తికి సంబంధించిన కొత్త విషయాన్ని కనుగొన్నారు. కరోనా వ్యాప్తిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మానవ మలం ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని తేల్చారు. కరోనా సోకిన వ్యక్తి నుంచి వచ్చిన మలం ద్వారా బయటికి వచ్చిన వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని గుర్తించారు.

మలం ద్వారా వ్యాప్తి.. పిత్తుల ద్వారా కూడా..

మలం ద్వారా వ్యాప్తి.. పిత్తుల ద్వారా కూడా..

అసోసియేషన్ ఫర్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ ఎపిడెమియాలజీ ప్రచురితం చేసిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడించారు. కరోనా రోగులు వాడిన టాయ్‌లెట్లు ఇతరులు ఉపయోగించినప్పుడు.. ఫ్లష్ చేసే సమయంలో వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తేల్చింది. పిత్తుల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, అది చాలా తక్కువని చెబుతున్నారు. ఈ మేరకు ఈ అంశాలపై మరిన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.

ఇదొక్కటే మార్గమంటూ..

ఇదొక్కటే మార్గమంటూ..

పర్దూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డా. క్వింగ్యాన్ చెన్ ఈ విధంగా కరోనా వ్యాప్తి జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలో తెలిపారు. టాయ్‌లెట్‌లో మూత వేసి ఫ్లష్ చేస్తే సరిపోతుందని తెలిపారు. దీంతో కరోనా వ్యాప్తిని చాలా వరకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని వివరించారు. ఇదొక్కటే సాధారణ పరిష్కార మార్గమని చెప్పారు. మూత వేయడం ద్వారా వైరస్ గాలిలోకి రాకుండా నియంత్రించవచ్చని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల దాటిన కేసులు, 2 లక్షలకుపైగా మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా 30లక్షల దాటిన కేసులు, 2 లక్షలకుపైగా మరణాలు..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,06,113 కరోనా బారిన పడగా, వీరిలో 8,83,216 మంది కోలుకున్నారు. 2,07,265 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే 50 మందికిపైగా కరోనాతో మరణించడం గమనార్హం. ఆ తర్వాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, యూకే దేశాల్లో 20వేల మందికిపైగా మరణించారు.

Recommended Video

Lockdown : PM Modi Video Conference With CMs On COVID-19 & Lockdown

English summary
Scientists say covid-19 can spread through fecal matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X