వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా వ్యాక్సిన్‌ను నమ్మలేం అంటున్న శాస్త్రవేత్తలు .. సైంటిస్ట్‌ల అనుమానాలకు అనేక కారణాలు  

|
Google Oneindia TeluguNews

రష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించడమే కాకుండా, తన కుమార్తెకు మొదటి డోస్ ఇచ్చి వ్యాక్సిన్ పై విశ్వసనీయత పెరిగేలా చేశారు.మంగళవారం మాస్కోలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాక్సిన్ ను లాంచ్ చేశారు.ఈ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి రానుందని చెప్పారు .

Recommended Video

Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists
 థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండా వ్యాక్సిన్ ఎలా ?

థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండా వ్యాక్సిన్ ఎలా ?

రష్యా కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ కు సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ ను ఎలా తీసుకు వస్తారని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయితేనే వ్యాక్సిన్ ను రిలీజ్ చేయాలని, అలా కాకుండా ముందుగానే రష్యా వ్యాక్సిన్ రిలీజ్ చేయడం హానికరమని వ్యాఖ్యానిస్తున్నారు.

ట్రయల్స్ డేటా లేకుండా వ్యాక్సిన్ సురక్షితమైనదని ఎలా నమ్ముతాం ?

ట్రయల్స్ డేటా లేకుండా వ్యాక్సిన్ సురక్షితమైనదని ఎలా నమ్ముతాం ?

రష్యా ఆవిష్కరించిన వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ డేటా కూడా విడుదల చేయలేదని, ట్రయల్స్ డేటా లేకుండా వ్యాక్సిన్ సురక్షితమైనదని ఎలా విశ్వసిస్తామని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇది బాధ్యతారాహిత్యమైన నిర్ణయమని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే రెండు సంవత్సరాల వరకు కరోనా వైరస్ దరిచేరదని పుతిన్ చెప్పిన నేపథ్యంలో, ఈ వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో సరిగా అధ్యయనం జరగలేదని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు.

ట్రయల్స్ సరిగా చేయకుండా ప్రజలపై ప్రయోగం అనైతిక చర్య కాదా ?

ట్రయల్స్ సరిగా చేయకుండా ప్రజలపై ప్రయోగం అనైతిక చర్య కాదా ?

వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సదరు వ్యక్తికి కరోనా వస్తే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నికల్ ట్రయల్స్ సరిగా జరగలేదని, పూర్తిస్థాయిలో అన్ని కోణాల నుండి పరిశీలన చేయకుండా ప్రజలపై ప్రయోగించడం అనైతిక చర్య అని వారంటున్నారు. రష్యా తయారుచేసిన ఈ వ్యాక్సిన్ మొదటి రెండవ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చాయని, మూడవ ట్రయల్ తన కుమార్తె పైన ప్రయోగించినట్లుగా పుతిన్ చెప్పడం ప్రస్తుత విమర్శలకు, అనుమానాలకు కారణమవుతోంది.

 వ్యాక్సిన్ వేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ?

వ్యాక్సిన్ వేసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ?

మూడవ ట్రయల్ కూడా సక్సెస్ అయితేనే ,ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రయోగం విజయవంతం అయితేనే మార్కెట్లోకి తీసుకురావాలని ,అలా కాకుండా హడావిడిగా రష్యా వ్యాక్సిన్ ను తీసుకురావడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ కు సంబంధించిన ట్రయల్స్ డేటాను ,సేఫ్టీ డేటాను , యూరప్, అమెరికాతో పాటుగా పలు దేశాలకు సమర్పించాలని, అప్పుడే ఈ వ్యాక్సిన్ కు లైసెన్స్ లభిస్తుందని పలువురు ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది.

 తక్కువ సమయంలో క్లినికల్ ట్రయల్స్ .. అనుమానాలకు ఇదో కారణం !!

తక్కువ సమయంలో క్లినికల్ ట్రయల్స్ .. అనుమానాలకు ఇదో కారణం !!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో రష్యా మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది. తక్కువ సమయంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిందని , ఫలితాలు ఎలా ఉంటాయో అన్న అనుమానంతోనే చాలా మంది శాస్త్రవేత్తలు రష్యా వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
An announcement by Russia on Tuesday that it will approve a COVID-19 vaccine after less than two months of human testing prompted alarm among global health experts, who said that with no full trial data, the vaccine is hard to trust.Intent on being first in the global race to develop a vaccine against the pandemic disease, Russia has yet to conduct large-scale trials of the shot that would produce data to show whether it works - something immunologists and infectious disease experts say could be a "reckless" step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X