• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిగ్ షాక్ : రష్యా,చైనా కరోనా వ్యాక్సిన్లలో లోపాలు... పనితీరుపై పరిశోధకుల సందేహాలు...

|

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటివరకూ 8లక్షల పైచిలుకు మందిని బలిగొన్నది. ఈ మహమ్మారిని అంతం చేయాలంటే శక్తివంతమైన టీకా ఒక్కటే మార్గమని ఇప్పటికే చాలామంది అభిప్రాయపడ్డారు. రష్యా,చైనా సహా పలు దేశాలు తయారుచేసిన టీకాలు ఆ దిశగా ఆశలు రేకెత్తించాయి. కానీ టీకా అభివృద్దికి సంబంధించి సైంటిస్టులు తాజాగా గుర్తించిన కొన్ని లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సామర్థ్యం,ప్రభావం పరంగా చైనా,రష్యా తయారుచేసిన టీకాల్లో లోపాలను సైంటిస్టులు గుర్తించారు.

  Top COVID-19 Vaccines లోపాలు, Russia, China టీకాల్లో 40శాతం మాత్రమే సామర్థ్యం ! || Oneindia Telugu
  ఆ రెండు వ్యాక్సిన్లు... Ad5 ఆధారితమే...

  ఆ రెండు వ్యాక్సిన్లు... Ad5 ఆధారితమే...

  మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కి ముందే కేన్సినో(CanSino) వాడకానికి చైనా అనుమతినిచ్చింది. Ad5(Adenovirus)కి కొన్ని సవరణలు చేయడం చేయడం ద్వారా చైనా దీన్ని అభివృద్ది చేసింది. ఇప్పటికే మిలటరీలో కేన్సినో వాడకానికి అనుమతి పొందిన ఈ కంపెనీ.. పలు దేశాల్లోనూ అనుమతులు పొందేందుకు హడావుడిగా సంప్రదింపులు జరుపుతోంది. ఇక రష్యాలోని గమలేయా ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కూడా Ad5 ఆధారంగా తయారుచేసిందే.

  పరిశోధకుల అనుమానాలు....

  పరిశోధకుల అనుమానాలు....

  'అడెనోవైరస్ వ్యాక్సిన్ వెక్టార్' టెక్నాలజీ ఆధారంగా ఈ రెండు వ్యాక్సిన్లను అభివృద్ది చేయడంతో పరిశోధకులు వీటిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లను మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే... అవి కరోనా వైరస్‌ను పోలిన స్పైక్స్‌ను అభివృద్ది చేస్తాయి. ఇవి అచ్చు కరోనా వైరస్ బాహ్య అంచులపై ఉండే గుండ్రటి ముళ్ల(స్పైక్స్) ఆకారంలో ఉండటంతో... మానవ శరీరం వెంటనే వీటిని గుర్తించి యాంటీబాడీస్‌(ప్రతి నిరోధకాలను)ను విడుదల చేస్తుంది. కాబట్టి నిజమైన కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించినా... అప్పటికే విడుదలైన యాంటీ బాడీస్‌ వాటితో పోరాడుతాయి.

  పనితీరుపై ఇవీ సందేహాలు...

  పనితీరుపై ఇవీ సందేహాలు...

  అయితే అప్పటికే కరోనా బారినపడి యాంటీబాడీస్ విడుదలైనవారిలో ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందని పలువురు పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. శరీరంలోకి ఇంజెక్ట్ చేసిన వెక్టార్‌(హాని చేయని వైరస్) కారణంగా అక్కడ కరోనా వైరస్ తరహా స్పైక్స్ ఏర్పడితే... అప్పటికే విడుదలైన యాంటీ బాడీస్ అసలైన వైరస్‌తో కాకుండా డమ్మీ వైరస్‌తో పోరాడటం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన అన్నా డర్బిన్ మాట్లాడుతూ...ఇదేం వ్యూహమో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇది 70శాతం సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండకపోవచ్చునని... 40శాతం సామర్థ్యం మాత్రమే కలిగి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే ఏ మార్గం లేనప్పుడు... ఉత్తమమైన వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఇవి కొంత నయమేనని అభిప్రాయపడ్డారు.

  షాకిచ్చిన ఫ్రెంచ్ ఫార్మా

  షాకిచ్చిన ఫ్రెంచ్ ఫార్మా

  కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న దేశాలకు ఫ్రెంచ్ ఫార్మా దిగ్గజం సనోఫి కూడా ఊహించని షాకిచ్చింది. తాము అభివృద్ది చేసిన కెవ్‌జరా వ్యాక్సిన్‌ ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహించిన మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ అసంపూర్తి ఫలితాలనే ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే తాము ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పటికీ... వ్యాక్సిన్ కోసం పనిచేయడాన్ని తాము గర్వంగా ఫీలవుతున్నామని సనోఫి గ్లోబల్ రీసెర్చ్ హెడ్ డా.జాన్ రీడ్ తెలిపారు.

  English summary
  High-profile Covid-19 vaccines developed in Russia and China share a potential shortcoming: They are based on a common cold virus that many people have been exposed to, potentially limiting their effectiveness, some experts say.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X