వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడుపులో కత్తెర.. 18ఏళ్లకు బయటపడింది..

అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపులో 15సెం.మీ కత్తెర ఉన్నట్టు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

వియత్నాం: ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు కత్తెరను మాత్రం కడుపులోనే పెట్టేసి కుట్లేశారు. మరింత ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. 18సంవత్సరాల తర్వాత ఆ కత్తెరను కడుపు నుంచి బయటకు తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. వియత్నాంకి చెందిన వాన్‌హత్‌ అనే వ్యక్తి 1998లో కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రమాదంలో అంతర్గత గాయాలు కావడంతో అతని కడుపుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ చికిత్స జరగ్గా.. చికిత్స సమయంలో ఉపయోగించిన కత్తెరను పొరపాటున పొట్టలోనే ఉంచి కుట్లు వేశారు.

Scissors pulled from Vietnam man's stomach 18 years after surgery

అయితే ఇన్నేళ్ల జీవితంలో వాన్ హత్ కి ఆ కత్తెర వల్ల ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదు. ఈమధ్యే కడుపులో నొప్పి తీవ్రం కావడంతో..తప్పనిసరై వైద్యులను సంప్రదించాడు. దీంతో అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపులో 15సెం.మీ కత్తెర ఉన్నట్టు గుర్తించారు.

వెంటనే కత్తెరను తొలగించడానికి శస్త్ర చికిత్స చేశారు. దాదాపు నాలుగు గం.ల పాటు శస్త్ర చికిత్స చేసి ఎట్టకేలకు కడుపు నుంచి కత్తెరను తొలగించారు. ప్రస్తుతం వాన్ హత్ కోటుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 1998లో వాన్ హత్ కు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడి కోసం ఇప్పుడు విచారిస్తున్నారు.

English summary
A Vietnamese man has had scissors removed from his abdomen which were left behind during surgery 18 years ago, after reporting a stomachache that was nearly two decades in the making.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X