వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్ మారిసన్

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా స్కాట్ మారిసన్ బాధ్యతలు చేపట్టనున్నారు. లిబరల్ పార్టీకి చెందిన మారిసన్.. పార్టీ నాయకుడి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో 45-40 ఓట్ల తేడాతో గెలుపొందారు.

స్కాట్ మారిసన్ ఎన్నికల్లో విజయం సాధించారని లిబరల్ పార్టీ విప్ నోలా మారినో వెల్లడించారు. మాజీ హోంమంత్రి, మాజీ పోలీసు అధికారి అయిన పీటర్ డట్టన్‌పై 45-40 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తెలిపారు.

Scott Morrison is new Australian PM as Malcolm Turnbull ousted

ఇప్పటి వరకు ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన మాల్కోమ్ టర్న్‌బుల్ స్థానంలో ఆయన రానున్నారు. మారిసన్ గతంలో కోశాధికారిగా పనిచేశారు. విదేశాంగ మంత్రి జూలీ బిషోప్ కూడా పోటీలో ఉన్నప్పటికీ ఆమె తొలి రౌండ్‌లోనే తప్పుకోవాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా గత 11ఏళ్లలో ప్రధాని మారడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. కాగా, టర్న్‌బుల్‍పై ప్రభుత్వంలో వ్యతిరేకత కారణంగా ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. టర్న్‌బుల్ రాజీనామాతో సిడ్నీ స్థానంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Scott Morrison has become Australia's new prime minister after Malcolm Turnbull was forced out by party rivals in a bruising leadership contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X