వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రఖ్యాత జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ కన్నుమూత...

|
Google Oneindia TeluguNews

స్కాటిష్ నటుడు,జేమ్స్ బాండ్ ఫేమ్ సీన్ కానరీ(90) శనివారం కన్నుమూశారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన జేమ్స్ బాండ్‌ సిరీస్‌కు చెందిన ఏడు చిత్రాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ 'డా.నో'లో జేమ్స్ బాండ్‌గా నటించారు. ఆ తర్వాత 1963లో వచ్చిన 'ఫ్రమ్ రష్యా విత్ లవ్',1964లో వచ్చిన 'గోల్డ్ ఫింగర్',1965లో వచ్చిన 'థండర్‌బాల్',1967లో వచ్చిన 'యూ ఓన్లీ లివ్ ట్వైస్',1971లో వచ్చిన 'డైమండ్స్ ఆర్ ఫరెవర్',1983లో వచ్చిన 'నెవర్ సే నెవర్ ఎగైన్' వంటి వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లలో ఆయన బాండ్ పాత్ర పోషించారు.

Sean Connery James Bond actor dies aged 90

1987లో వచ్చిన 'ది అన్‌టచబుల్స్' చిత్రంలో ఐరిష్ పోలీస్ పాత్రలో నటనకు గాను సీన్ కానరీ ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే పలు చిత్రాల్లో నటనకు గాను రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులతో పాటు రెండుసార్లు బాఫ్టా అవార్డులను గెలుచుకున్నారు. తన కెరీర్ మొత్తంలో అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలతో పాటు ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాల్లో కానరీ నటించారు.

నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగిన సీన్ కానరీ బాల్యం దయనీయమైన పరిస్థితుల్లో గడిచింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఉన్న మురికివాడలో అత్యంత పేదరికంలో ఆయన పెరిగారు. మొదట్లో కెఫిన్(మృతదేహాలను ఉంచే పెట్టెలు)లకు పాలిష్ చేసే పనిచేసేవారు. ఆ తర్వాత పాల వ్యక్తిగా,లైఫ్ గార్డ్‌గా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో కానరీ బాడీ బిల్డింగ్‌పై దృష్టి సారించారు. అదే ఆయన యాక్టింగ్ కెరీర్‌కు బాటలు వేయగా... అనతికాలంలోనే హాలీవుడ్‌లో మంచి పేరు,ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

జేమ్స్ బాండ్ చిత్రాల్లోనే కాకుండా ప్రఖ్యాత దర్శకుడు ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంలో వచ్చిన మార్ని(1964),కేండిస్ బెర్జిన్ దర్శకత్వంలో వచ్చిన 'ది విండ్ అండ్ లయన్(1975)',జూన్ హూస్టన్ దర్శకత్వంలో వచ్చిన 'ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్(1975),స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్(1989) తదితర చిత్రాల్లో సీన్ కానరీ నటించి మెప్పించారు.

English summary
Former James bond Sean Connery dies at the age of 90. This legendary actor won an Oscar award and three Golden globe awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X