వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370: అన్వేషిత ప్రాంతం రెండింతలు చేయనున్నారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యల ప్రాంతాన్ని పెంచనున్నారు. గత ఏడాది మార్చి 8వ తేదీన ఐదుగురు భారతీయులు సహా 239 మంది ప్రయాణీకులతో కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు బయలుదేరిన ఎంహెచ్ 370 గల్లంతైంది.

ఈ విమానం కోసం ఎన్నో దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు దాని ఆచూకీ లభించలేదు. దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర విమానం ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు.

Search area for missing Malaysia Airlines flight MH370 to be expanded

దీంతో మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమానం ఆచూకీ మే నెల లోపు దొరకకపోతే ఈ మేరకు ప్రయత్నాలు చేపట్టాలని యోచిస్తున్నారు. మలేషియాకు ఆస్ట్రేలియా, చైనాలు సహకరించేందుకు సంసిద్ధత తెలిపాయి.

ప్రస్తుతం నాలుగు నౌకలు ప్రస్తుతం అన్వేషిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అరవై శాతం మేర అన్వేషణ పూర్తయింది. మరో నలభై శాతం ఉంది. ఆ తర్వాత కూడా దొరకకపోతే, మే నెల తర్వాత అన్వేషణ ప్రాంతాన్ని మరో ఆరవై వేల కిలోమీటర్లకు పెంచనున్నారు.

English summary
Australian, Malaysian and Chinese ministers have decided to expand search area by another 60,000 sq km for the missing Malaysia Airlines flight MH370 if nothing is found in the current search zone, BBC reported on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X