వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గే సెక్స్ నేరం కాదు: స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

గే సెక్స్ నేరం కాదు : సుప్రీం కోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 377పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై ఎల్జీబీటీ సంబరాలు చేసుకుంది.

వ్యక్తిగత స్వేచ్ఛను అందరూ గౌరవించాలని చీఫ్ జస్టిస్ తన తీర్పులో తెలిపారు. లెస్బియన్స్, గేలకు (ఎల్జీబీటీ) సమాన హక్కులు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని తెలిపారు. సెక్షన్ 377 ఏకపక్షంగా ఉందని, ఈ సెక్షన్‌లోకి గే సెక్స్ రాదని పేర్కొన్నారు.

రిటైర్‌మెంట్ టైమ్: 20 రోజుల్లో 10 కీలక తీర్పులు ఇవ్వనున్న సీజే దీపక్ మిశ్రా రిటైర్‌మెంట్ టైమ్: 20 రోజుల్లో 10 కీలక తీర్పులు ఇవ్వనున్న సీజే దీపక్ మిశ్రా

ఈ చట్టం 158 ఏళ్ల క్రిందట బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో తీసుకు వచ్చింది. ఇప్పుడు బ్రిటన్‌లో ఈ చట్టం లేదు. మన దేశంలో మాత్రం ఇప్పటి వరకు కొనసాగింది. ఇప్పుడు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది.

కాగా, పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కాన్నీ సెక్షన్ 377 నేరంగా పేర్కొంటుంది. ఈ సెక్షన్‌ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణను పూర్తి చేసింది.

Section 377 verdict updates: Discrimination on basis of sexual orientation violates fundamental rights

స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు సహా వివిధ వర్గాల వాదనలను విన్నది. అనంతరం గత జులై 17న తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు సెక్షన్‌ 377 చట్టబద్ధతపై నిర్ణయాన్ని కేంద్రం కూడా అత్యున్నత న్యాయస్థానం విచక్షణకు వదిలేసింది.

మైనర్లు, జంతువులకు సంబంధించిన నిబంధనలను మాత్రం కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. అసహజ నేరాలకు సంబంధించిన సెక్షన్ 377 ప్రకారం... స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగార చర్యలకు పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశముంది.

ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పరస్పర అంగీకారంతో ఒకే లింగానికి చెందిన ఇద్దరి మధ్య జరిగే లైంగికచర్య నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009లో తీర్పు చెప్పింది. అయితే 2013లో ఈ తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసింది. పాత నిబంధనలనే వర్తింపచేసింది. దీనిపై తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఇప్పుడు కోర్టు తీర్పు చెప్పింది.

English summary
In a landmark verdict, the Supreme Court today scrapped the controversial Section 377- a 158-year-old colonial law on consensual gay sex. "No one can escape from their individualism. Society is now better for individualism. In the present case, our deliberations will be on various spectrums," said Chief Justice Dipak Misra, who headed the five judge bench hearing the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X