వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మ‌ృతి

|
Google Oneindia TeluguNews

కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది.

 security force attack talibans : 24 die

ప్రతీకారం తీర్చుకుంది ..

తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ తాలిబన్లు లక్ష్యంగా దాడులు చేపట్టింది. పక్తీకా ప్రావిన్సులో జుర్మాత్‌, బెర్మాల్‌ జిల్లాల్లో 20 మంది తాలిబన్లను హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్‌ జిల్లాలో ఇద్దరు, హేరాత్‌ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆప్గానిస్థాన్ లో తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. అయితే ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు చేపట్టిన దాడుల గురించి తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అస్థిరత్వం ..

తాలిబన్లు, ఐఎస్‌ ఉగ్రవాదుల చర్యల కారణంగా ఆప్గానిస్థాన్ లో రాజకీయ అస్థిరత నెలకొంది. దీంతోపాటు సామాజికంగా దేశం వెనుకబాటుకు గురైంది. భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో మిత్ర దేశాల సాయం తీసుకున్నాయి. ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటూ .. ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపుతుంది. హేరాత్, పక్తీకా, గజనీ‌ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్‌, జాబూల్‌, నంగర్హర్‌ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి వివరాలు .. ఉగ్రవాదుల మృతికి సంబంధించిన డిటైల్స్ తెలియాల్సి ఉంది.

దాడి .. ప్రతీ దాడి

ఆప్గానిస్థాన్ లో తాలిబన్లు దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆప్గానిస్థాన్ తమ భాగస్యామ్వ పక్షాలతో కలిసి ... తాలిబన్లపై దాడులకు దిగుతోంది. ఇవాళ చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదివరకు తాలిబన్లు చేసిన దాడుల్లో అమాయక అప్గనిస్థాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
The security targets of the terrorists. 24 terrorists were killed in the attacks in Haraat, Ghazni provinces. In this regard, the Afghanistan military reported to the media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X