వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: సెల్ఫీలతో అందానికి ముప్పు, ముసలితనం!

|
Google Oneindia TeluguNews

లండన్: ఈ వార్త సెల్ఫీ ప్రియులకు చేదు వార్తే. ఎందుకంటే ఇబ్బడిమొబ్బడిగా, ఎక్కడిపడితే అక్కడ అధిక సంఖ్యలో సెల్ఫీలు తీసుకునేవారి చర్మం పాడవుతుందనీ, ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు. అంతేగాక, చర్మానికి దెబ్బతిన్న చోట బాగుచేసుకునే సహజగుణం ఉంటుందని, రేడియేషన్ కారణంగా చర్మం ఆ గుణాన్ని కోల్పోతుందని పేర్కొంటున్నారు.

selfie

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదని చెప్పారు. ఇవి డిఎన్ఏపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

దీంతో చర్మం కాంతి నుంచి రక్షణ పొందే అవకాశం లేకుండా పోతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా అధికంగా సెల్ఫీలు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. సెల్ఫీలకు దూరంగా ఉండి చర్మాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

English summary
Selfie-addicts, take note! Constantly exposing your face to the light and radiation from smartphones may damage your skin, speeding up ageing and promoting wrinkles, dermatologists have warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X