వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు పేలుళ్లు: కుర్దీష్ కమాండర్‌తోపాటు 15మంది మృతి

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: ఉత్తర ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ సీనియర్ కుర్దీష్ కమాండర్ మృతి చెందారు. తన కారు దగ్గర బాంబు పేలడంతో కుర్దీష్ పేష్‌మార్గ్ ఫోర్సెస్‌కు చెందిన 118 బ్రిగేడ్ అధిపతి మేజర్ జనరల్ సలాహ్ దేల్మాని, తన ఇద్దరు రక్షకులతో సహా మృతి చెందాడు.

ఈ పేలుడు ఘటన కిర్కుక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దేల్మాని కారులోనే బాంబు పెట్టారా? లేక కారు వద్ద బాంబు పేలడంతో ఈ ఘటన జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా.. బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించారు.

Senior Kurdish commander killed in north Iraq bombing

బాగ్దాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఆరుగురు ప్రజలు మృతి చెందారు. సెంట్రల్ బాగ్దాద్‌లోని తెహ్రీర్ స్క్వేర్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 12మందికి గాయాలయ్యాయి.

బాగ్దాద్ ఇవారులో జరిగిన మరో బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

English summary
A bomb blast in northern Iraq killed a senior Kurdish commander prominent in the fight against ISIS and two of his bodyguards Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X