వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు ఆరోపణలు: సియోల్ మేయర్ ఆత్మహత్య, క్షమించాలంటూ నోట్

|
Google Oneindia TeluguNews

సియోల్: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ మేయర్ పార్క్-వోన్-సూన్(64) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనపై లైంగిక ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే ఆయన బలవన్మరణానికి పాల్పడటం ఆ దేశంలో సంచలనంగా మారింది. అంతేగాక, ఆయన దక్షిణ కొరియా అధ్యక్ష రేసులో కూడా ఉండటం గమనార్హం.

పోలీస్ కస్టడీలో లైంగిక దాడి ? తండ్రీకొడుకుల దుర్మరణం... తమిళనాడులో రాజకీయ దుమారం పోలీస్ కస్టడీలో లైంగిక దాడి ? తండ్రీకొడుకుల దుర్మరణం... తమిళనాడులో రాజకీయ దుమారం

అందరూ క్షమించాలంటూ..

అందరూ క్షమించాలంటూ..

సియోల్ నగరంలోని ఓ పర్వత ప్రాంతంలో పార్క్ వోన్ సూన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం మేయర్ అధికారిక నివాసంలో లభ్యమైన సూసైడ్ నోట్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ నన్ను క్షమించాలి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతోపాటు ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. చాలా బాధ కలిగించినందుకు నా కుటుంబసభ్యులు కూడా నన్ను క్షమించాలి అని పార్క్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇందులో మేయర్ పార్క్ వోన్ సూన్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

లైంగిక వేధింపుల ఆరోపణల మరుసటి రోజే..

లైంగిక వేధింపుల ఆరోపణల మరుసటి రోజే..

కాగా, సియోల్ మేయర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో ఆఫీసు టైంలోనే అనుచితంగా ప్రవర్తించేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 2015 నుంచి ఆమె అతని వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. ఈ క్రమంలో మేయర్ పార్క్ కేసు నమోదైంది.

Recommended Video

Donald Trump, Kim Jong Un మధ్య ఇప్పట్లో ఎలాంటి సమావేశాలు లేవు! - Kim Yo Jong || Oneindia Telugu
అధ్యక్షుడి రేసులో ఉన్న వ్యక్తి..

అధ్యక్షుడి రేసులో ఉన్న వ్యక్తి..

ప్రస్తుతం అధికార పార్టీలో కీలక నేతగా పార్క్ కొనసాగుతున్నారు. సియోల్ నగరానికి గడిచిన దశాబ్దం నుంచి ఆయనే మేయర్‌గా ఉన్నారు. సామాజిక సమనత్వాన్ని ప్రోత్సహించే పార్క్.. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ గెలుపొందారు. అంతేగాక, 2022లో జరగనున్న దక్షిణ కొరియా అధ్యక్ష రేసులో కూడా పార్క్ ఉండటం గమనార్హం. పార్క్ ఆత్మహత్య చేసుకోవడంతో దేశం ఒక మంచి నాయకుడ్ని కోల్పోయిందని మీడియాతోపాటు ఆయన మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, శిక్ష నుంచి తప్పించుకునేందుకే పార్క్ బలవన్మరణానికి పాల్పడివుంటారని ఆయన వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది.

English summary
The mayor of Seoul, a contender to be South Korea's next president and a former human rights lawyer, took his own life a day after he was accused of sexual harassment, authorities said Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X