వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

North Korea Activities : ఉత్తరకొరియాపై భద్రతా మండలి నిర్ణయం ? | Oneindia Telugu

సియోల్: ఉత్తరకొరియా రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంతో దక్షిణ కొరియా కూడ రెచ్చిపోయింది. ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన క్షణాల్లోనే దక్షిణ కొరియా కూడ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాకు బుద్ది చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ క్షిపణిని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.

కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉత్తర కొరియాను నాశనం చేస్తాం, యుద్దం కోరుకొంటుంది'

ఉత్తరకొరియా రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.. ఈ క్షిపణి ద్వారా ఉత్తరకొరియా నుండి తన లక్ష్యాన్ని చేధించే సత్తా ఉత్తరకొరియాకు ఉందని రుజువైంది. అయితే ఈ క్షిపణి అత్యంత శక్తివంతమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

షాక్: నేడే కిమ్ కీలక ప్రకటన,ఉ.కొరియా భారీ ప్లాన్, ఏం జరుగుతోంది?షాక్: నేడే కిమ్ కీలక ప్రకటన,ఉ.కొరియా భారీ ప్లాన్, ఏం జరుగుతోంది?

అయితే ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు దక్షిణ కొరియా కూడ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరకొరియాను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా కూడ సంకేతాలు ఇచ్చింది.

ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?ట్రంప్‌కు షాక్: ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కిమ్, అమెరికాలో ఎక్కడైనా దాడి?

<strong></strong>షాక్: వైట్‌హౌస్ సహ 15 ప్రాంతాల్లో అణుదాడికి కిమ్ ప్లాన్షాక్: వైట్‌హౌస్ సహ 15 ప్రాంతాల్లో అణుదాడికి కిమ్ ప్లాన్

 దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం

దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం

ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేయడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్షిపణితో అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా ఉత్తరకొరియా దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు ప్రకటించారు. అయితే అదే సమయంలో ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా కూడ సంకేతాలు పంపింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేసిన క్షణాల్లోనే దక్షిణ కొరియా కూడ క్షిపణి ప్రయోగం చేసింది. ఈ క్షిపణి కూడ తమ లక్ష్యాన్ని చేరుకొంది. ఈ రెండు దేశాలు పోటా పోటీగా క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 మూడో ప్రపంచ యుద్దం జరిగేనా?

మూడో ప్రపంచ యుద్దం జరిగేనా?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వ్యవహరం మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరకొరియాను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు కూడ లేకపోలేదని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

 ఫోన్లో చర్చించిన ట్రంప్

ఫోన్లో చర్చించిన ట్రంప్

ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జపాన్‌ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు.ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై చర్చించారు.

 భద్రతా మండలి ఏం చేయనుంది.

భద్రతా మండలి ఏం చేయనుంది.

ఉత్తర కొరియా వ్యవహరశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కానుంది.ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై చర్చించనుంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియాను చేర్చడంపై భద్రతా మండలి చర్చించనుంది.అయితే భద్రతా మండలి ఉత్తరకొరియాపై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

English summary
The retaliation took place just six minutes after North Korea launched their fresh missile test.South Korea’s missiles all successfully hit their targets about 50 meters out at sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X