వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌: గుడ్‌న్యూస్ - 2020లోనే వస్తుందన్న సీరం సీఈవో - ఫైనల్ ధర ఎంతంటే..

|
Google Oneindia TeluguNews

క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తన ప్రయోగాలను ముమ్మరం చేసింది. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం సంస్థ రూపొందించిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ మార్కెట్ లోకి ఎప్పుడు రాబోతున్నది, దాని ధర ఎంతుందనే విషయాలపై సీరం సీఈవో అధర్ పునావాలా సోమవారం కీలక ప్రకటన చేశారు.

Recommended Video

COVID-19 : Oxford Corona Vaccine ఈ ఏడాదిలోనే.. సీరం సీఈవో వెల్లడి ! || Oneindia Telugu

కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?

ఈ ఏడాది చివర్లోనే..

ఈ ఏడాది చివర్లోనే..

ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనెకా, సీరం సంస్థలు తోకలిసి రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్, సౌతాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో తొలి, మలి దశ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇండియాలోనూ ఫేజ్-2, ఫేజ్-3 ప్రయోగాలు నిర్వహిస్తామన్న అభ్యర్థనకు డీసీజీఐ గత మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో ట్రయల్స్ వేగవంతమయ్యాయని, ప్రస్తుతం అతి కీలకమైన మూడో దశలో ఉన్నామని, అంతా అనుకున్నట్లే జరిగితే ఈ ఏడాది చివర్లోనే వ్యాక్సిన్ జనసామాన్యానికి అందుబాటులోకి తెస్తామని సీరం సంస్థ సీఈవో అధర్ పునావాలా తెలిపారు.

విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?

ముంబై, పుణె రోగులపై..

ముంబై, పుణె రోగులపై..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సహాయసహకారాలతో కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ జోరు పెంచామని, మూడో దశ ప్రయోగాల్లో పాల్గొనేందుకు ముంబై, పుణెకు చెందిన సుమారు 5వేల మంది వాంటలరీగా ముందుకొచ్చారని, ఆగస్టు చివరి వారంలో వాళ్లకు డోసులు ఇస్తామని, కొవిషీల్డ్ టెస్టులన్నీ సక్సెస్ అయితే, ఒకే సారి 40కోట్ల డోసులు తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని సీరం సీఈవో పేర్కొన్నారు.

ఫైనల్ ధరను ఫిక్స్ చేస్తాం..

ఫైనల్ ధరను ఫిక్స్ చేస్తాం..

ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఉత్పత్తి చేస్తోన్న ‘కొవిషీల్డ్' ప్రధానంగా భారత్ తోపాటు పేద, ఆదాయం తక్కువగా ఉన్న దేశాలకు ముందుగా సప్లై చేస్తామని పునావాలా ముందునుంచే చెబుతున్నారు. ఆ క్రమంలోనే గవి, బిల్ గేడ్స్ కు చెందిన వితరణ సంస్థలతోనూ సీరం కీలక ఒప్పందాలు చేసుకుంది. వ్యాక్సిన్ ఒక్కో డోసు గరిష్ట ధర 3 డాలర్లు(రూ.225) ఉండొచ్చని అధర్ పునావాలా మూడు రోజుల కిందట వెల్లడించారు. సోమవారం నాటి ప్రకటనలో మాత్రం.. వ్యాక్సిన్ ధరలో మార్పులు ఉండొచ్చని, రెండు నెలల్లో ఫైనల్ ధర వెల్లడిస్తామని చెప్పారు.

2కోట్లు దాటిన ఇన్ఫెక్షన్లు..

2కోట్లు దాటిన ఇన్ఫెక్షన్లు..

కరోనా విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలతోపాటే వైరస్ వ్యాప్తి కూడా వేగంగా సాగుతున్నది. సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 7.35లక్షలుగా ఉంది. ఇండియాలో గడిచిన రెండు వారాలుగా కొత్త కేసుల సునామీ కొనసాగుతున్నది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన లెక్కలను బట్టి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కేసులు, 1007 మరణాలు నమోదయ్యాయి. ఇండియాలో మొత్తం కేసులు 22.26లక్షలకు, మరణాలు 44,599కు పెరిగాయి.

English summary
Adar Poonawalla, Chief Executive Officer of Pune-based Serum Institute of India (SII), has said the coronavirus vaccine may be ready by the end of this year and that the final price of the anti-virus dose will be announced in two months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X