వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగిన కారును ఢీకొట్టిన రైలు: ఏడుగురు మృతి

|
Google Oneindia TeluguNews

శాంటియాగో: దక్షిణ అమెరికా దేశమైన చిలీలోని మౌలే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గూడ్సు రైలు.. పట్టాలపై ఆగిపోయిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

గూడ్సు రైలు కావడంతో ప్రయాణికులు లేరు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Seven killed after train collides with auto in Chile

ఆత్మాహుతి దాడి: ముగ్గురు సైనికులు మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని బల్ఖ్‌ ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. సైన్యానికి చెందిన మినీ బస్‌పై జరిగిన ఈ దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. ఈ మేరకు ప్రావిన్స్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి మునిర్‌ అహ్మద్‌ ఫర్హాద్‌ తెలిపారు.

దాహ్‌దాది జిల్లాలో ఆర్మీ వాహనం లక్ష్యంగా ఈ దాడి జరిగినల్లు తెలిపారు. ఈ దాడిలో మరో 18 మంది సైనికులు గాయాలపాలయ్యారు. దాడులకు పాల్పడింది తామేనంటూ తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు.

English summary
Seven people were killed Sunday after a freight train smashed into a car that had become stranded on the tracks in southern Chile, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X