• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీ రక్తమోడిన ఆప్ఘనిస్తాన్: తాలిబన్ల గుండెకాయపై దాడి: కాందహార్ మసీదులో మూడు పేలుళ్లు

|
Google Oneindia TeluguNews

కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఆప్ఘనిస్తాన్‌లో మారణహోమం నిత్యకృత్యమైంది. తరచూ బాంబు దాడులు చోటు చేసుకుంటోన్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ఆసుపత్రుల్లో కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్స్-ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు మారణ హోమానికి కారణమౌతున్నట్లు తెలుస్తోంది.

కాందహార్‌లో పేలుడు..

తాజాగా- కాందహార్‌లో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 46 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాందహార్‌లోని బీబీ ఫాతిమా మసీదులో ఈ పేలుడు చోటు చేసుకుంది.

షియా మసీదులో..

షియా ముస్లింలకు చెందిన మసీదు అది. ముస్లింలు శుక్రవారాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. ఆ రోజున మసీదుల్లో నమాజ్‌ చేస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటుంటారు. శుక్రవారం ప్రార్థనలు కొనసాగుతోన్న సమయంలో బీబీ ఫాతిమా మసీదులో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో నమాజ్ చేస్తోన్న సమయంలో మసీదులోనే ఈ పేలుడు సంభవించింది. పేలుడు అనంతరం మసీదు ధ్వంసమైంది. చెల్లాచెదురైన మృతదేహాలతో సంఘటనా స్థలం భయానకంగా మారింది.

తాలిబన్ల గుండెకాయపై

కాందహార్.. తాలిబన్లకు గుండెకాయ వంటి నగరం. ఈ నగరంపై వారికి మొదటి నుంచీ గట్టి పట్టు ఉంది. ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకోవాలనుకుంటే కాందహార్‌లోనే మకాం వేస్తుంటారు తాలిబన్లు. అలాంటి నగరంలో.. షియా ముస్లింలకు చెందిన మసీదులో బాంబు పేలుడు చోటు చేసుకోవడం.. ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా పని చేస్తోన్న వారే ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.

గత వారం కూడా..

ఈ దాడికి తామే కారణమంటూ ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు. దీనికి- ఇస్లామిక్ స్టేట్స్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఓ మసీదుపై ప్రాణాంతక దాడి సంభవించడం ఇది రెండోసారి. గత శుక్రవారం కూడా కుందుజ్ ప్రావిన్స్‌లో షితె ముస్లింలతో క్రిక్కిరిసిన ఓ మసీదులో బాంబు పేలుడు సంబవించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 46 మంది దుర్మరణం పాలయ్యారు.

నిర్ధారించిన ప్రభుత్వ ప్రతినిధి..

పేలుడు సంభవించిన ఘటనను ఆఫ్ఘనిస్తాన్ మంత్రివర్గ అధికార ప్రతినిధి ఖారీ సయ్యద్ ఖొష్తి నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. కాందహార్ సిటీలోని ఫస్ట్ డిస్ట్రిక్ట్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుందని, ఈ ఘటనలో తమ షియా ముస్లిం సోదరులు అమరులయ్యారని, చాలామంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియరావట్లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.

  Taliban Requests India To Resume Commercial Flights To Afghanistan || Oneindia Telugu
  మూడు పేలుళ్లు..

  మూడు పేలుళ్లు..


  పేలుడు సమాచారం అందుకున్న వెంటనే తాలిబన్ బలగాలు బీబీ ఫాతిమా మసీదుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించాయి. మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మసీదు ముఖ ద్వారం, దక్షిణం వైపు ప్రాంతం, ముఖం కడుక్కునే చోట ఈ మూడు బాంబులు పేలినట్లు తాలిబన్ బలగాలు నిర్ధారించాయి.

  English summary
  A large explosion tore through a shia mosque in the southern Afghan city of Kandahar during Friday prayers, killing at least seven people and wounding 13, officials and provincial leaders said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X